మద్యం తాగితే మెదడు పని చేయదు అంటే అది నిజమే అంటున్నారు నిపుణులు .. ఆల్కాహాల్ లోని హాని కారక బ్యాక్టీరియా ఉండటం వల్ల మెదడుకు వెళ్లాల్సిన సమాచారం మద్యలో ఆగి పోవడంతో తాము ఏమి చేస్తున్నాం అనేది మర్చిపోయి ప్రవర్తిస్తారు.. అందుకే మద్యం సేవించిన వ్యక్తిని కోతితో సమానం అని అంటారు.. అయితే నిన్న సూర్యగ్రణం కారణంగా ఓ తాగుబోతు ఓ ఇంటికి వెళ్లి తాగడానికి మంచి నీళ్ళు అడిగాడు. గ్రహం కారణంగా ఆమె ఇవ్వడానికి నిరాకరించింది.. దాంతో కోపం తో ఊగి పోయిన అతను ఆమె పై దాడికి దిగాడు.. 

 

 


వివరాల్లోకి వెళితే.. . శ్రీకాకుళం జిల్లా రాజాం పట్టణం లోని బొబ్బిలి రోడ్డు లో నివాసముంటున్న మహిళ భర్త 13ఏళ్ల క్రితం చని పోయాడు. దీంతో కుమార్తె తో కలిసి ఆమె ఒంటరిగా జీవిస్తోంది. ఆదివారం ఉదయం రాజాం పట్టణం లోని మల్లయ్య పేటకు చెందిన ఓ యువకుడు మద్యం మత్తు లో ఆమె ఇంటికి వెళ్లి మంచి నీళ్లు అడిగాడు. సూర్య గ్రహణ సమయం కావడం తో నీళ్లు ఇవ్వనని ఆమె చెప్పింది. దీంతో ఆగ్రహించిన యువకుడు చేతిలో ని మద్యం సీసా తో ఆమె తల పై కొట్టాడు.

 

 


దాంతో బాధితురాలు గట్టిగా కేకలు వేయడంతో స్థానికులు పెద్దయెత్తున గుమిగూడారు. దీంతో నిందితుడు కంగారుపడి అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ ఘటన జరిగిన సమయంలో కుమార్తె ఇంట్లో లేదు. స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించి బాధితురాలిని రాజాం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మొహం పై సీసాతో కొట్టడంతో తీవ్ర రక్త స్రావమైందని, ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగానే ఉందన్నారు. బాధితురాలు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: