ప్రేమకు వయస్సుతో సంబంధం లేదు. ఎప్పుడు, ఎక్కడ, ఎలా, ఎవరిలో ప్రేమ పుడుతుందో ఎవరికీ తెలియదు. ఇక ఉపాధ్యాయులు అంటే విద్యార్థులకు ఇన్స్పిరేషన్ గా ఉండాలి. విద్యాబుద్ధులు నేర్పించాలీ. సత్ప్రవర్తనను నేర్పించాలి. విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాటలు వేయగల అవకాశం ఉపాధ్యాయులకు మాత్రమే ఉంటుంది.

అందుకే గురువు స్థానం ఎప్పుడు గొప్పదే.అభంశుభం తెలియని విద్యార్థుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు. చిన్నపిల్లల స్థాయి నుంచి పెద్దఅయ్యేంత వరకు విద్యార్థులకు నేర్పేది గురువులే. విద్యాబుద్ధులు నేర్పి సత్ప్రవర్తన నేర్పాల్సిన ఉపాధ్యాయులే విద్యార్థుల కంటే హీనంగా ప్రవర్తిస్తే ఇక విద్యార్థులకు వారి కొత్తగా విలువలు ఏం నేర్పిస్తారు. ఇదిలా ఉంటే కొన్ని షాకింగ్ ప్రేమ కథలను మీరు వినే ఉంటారు.

అలాంటిదే రాజస్థాన్ రాష్ట్రంలో జరిగిన అదో విచిత్రమైనప్రేమగాథ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. ఓ ఉపాధ్యాయుడు, మైనర్ విద్యార్ధినిపై మనసు పారేసుకున్నాడు. ముచ్చటైన మాటలతో ఇద్దరు ఒక్కటయ్యారు. ఇంకా ట్విస్ట్ ఏంటంటే.. ఇద్దరూ కూడా ఇంటి నుంచి పారిపోయారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన అక్కడి స్థానికులను ఒక్కసారిగా షాక్ ‌కు గురి చేసింది.

ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే… అజ్మీర్‌ కు చెందిన ఓ వ్యక్తి పిల్లలకు ట్యూషన్ చెబుతూ తన జీవనం సాగిస్తున్నాడు. ఇతగాడు తన శిష్యులలో ఒకరైన విద్యార్ధినితో ప్రేమలో పడ్డాడు. అంతేకాకుండా ఆ అమ్మాయితో కలిసి జంప్ అయ్యాడు. ఇద్దరూ పారిపోయి పెళ్లి చేసుకోవాలని అనుకున్నట్లు తెలుస్తోంది. అయితే, పెళ్లి జరగలేదు కానీ.. ఆత్మహత్యకు ప్రయత్నించారట.

కానీ అందులోనూ విఫలం అయ్యారని సమాచారం. ఇదిలా వుంటే, ఆ అమ్మాయి కుటుంబం సదరు ఉపాధ్యాయుడిపై పోలీసులకు ఫిర్యాదు చేయగా.. దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఎట్టకేలకు ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. అదే సమయంలో, మైనర్ బాలికను ఆమె కుటుంబసభ్యులకు అప్పగించారు. టీచర్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు కిడ్నాప్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

మరింత సమాచారం తెలుసుకోండి: