ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుపతిలో సుహాసిని అనే ఒక ఘరనా లేడీ పెళ్లిళ్ల వ్యవహారం గురించి ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. ఒకళ్ళకి తెలియకుండా మరొకళ్ళని తన మాయ మాటలతో నమ్మించి అనాథను అని చెప్పి పెళ్లిళ్లు చేసుకోవడం, వాళ్ళ దగ్గర అందినకాడికి డబ్బులు వసూలు చేసి ఉడాయించడం సుహాసిని పని.తప్పు చేసే వాళ్ళు ఎప్పటికన్నా చట్టానికి దొరుకుతారు. అలానే అనాథనని నమ్మించి ప్రేమ పేరుతో వివాహాలు చేసుకుంటున్న సుహాసిని మోసాలు కూడా అందరికి తెలిసిపోయాయి. అయితే ఇప్పుడు ఈ కేసులో సరికొత్త ట్విస్ట్ ఒకటి బయట పడింది.


 సుహాసిని తన మొదటి భర్త సహకారంతోనే ఇలా మోసాలకు పాల్పడుతోందని తెలిసింది. ఈ విషయం చెప్పింది కూడా మరెవరో కాదు.తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన ఆమె రెండో భర్తే. తన నుంచి వివిధ రూపాల్లో సుహాసిని రూ.15 లక్షలు దోచుకుందని ఆరోపించాడు. ఈ మేరకు అతను ఆదివారం ఓ వీడియో విడుదల చేశాడు.ఆ వీడియోలో  ‘2018లో నాకు సుహాసిని అనాథగా పరిచయమైంది. నువ్వంటే ఇష్టం పెళ్లి చేసుకుందామని అడిగింది. దీంతో 2019 మే 22న వివాహం చేసుకున్నాము. మా కుటుంబ సభ్యులతో మంచిగా నటించి వారి దగ్గర నుంచి రూ.10 లక్షలు తీసుకుంది. రెండు నెలల తర్వాత ఆమె ప్రవర్తనలో మార్పు గమనించాను.అయితే అంతకు ముందే సుహాసిని తన మేనమామ అంటూ నెల్లూరు జిల్లా కోనేటిరాజుపాళేనికి చెందిన వ్యక్తిని  నాకు పరిచయం చేసింది.


 తరువాత తెలిసిందే అతను సుహాసిని మొదటి భర్త అని. అలాగే వారి ఇద్దరికి పుట్టిన పిల్లలను తన మేనత్త పిల్లలని నమ్మించింది.తరువాత ఆరా తీయగా ఆ పిల్లలు వారికే పుట్టినట్లు తెలిసింది. వెంటనే స్థానిక పోలీసులను ఆశ్రయించినా వారు స్పందించలేదు. ఈ విషయం పసిగట్టిన సుహాసిని ఆమరుసటి రోజే మా ఇంట్లో నుంచి వెళ్లిపోతూ దాదాపు రూ.5 లక్షల విలువజేసే బంగారం తీసుకెళ్లింది. మరోసారి పోలీసుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదు.తనను ఎవరూ పట్టుకోలేరు అనే ఇలాంటి దారుణాలకు పాల్పడుతుంది. అప్పుడే కనుక పోలీసులు పట్టించుకుంటే నాలాగా మరొక యువకుడు బలయ్యేవాడే కాదు అని ఆ వీడియోలో బాధితుడు పేర్కొన్నాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: