ఇటీవలే సైదాబాద్ సింగరేణి కాలనీ లో ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారం హత్య ఘటన ఎంత సంచలనంగా మారిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ ఘటన ఒక్కసారిగా అందరినీ ఉలిక్కిపడేలా చేసింది. ఈ క్రమంలోనే ఈ ఘటనలో నిందితుడిగా ఉన్న రాజు అనే వ్యక్తిని వెంటనే ఉరి తీసి చంపాలి అంటూ అందరూ డిమాండ్ చేశారు.  నిందితుడు రాజు కి సరైన శిక్ష విధించే వరకూ తాము ఊరుకునేది లేదు అంటూ బాధిత కుటుంబ సభ్యులు అందరూ నిరసన చేపట్టారు. ఈ క్రమంలోనే వేల సంఖ్యలో పోలీసులు కూడా రాజు కోసం గాలింపు చర్యలు చేపట్టారు. రాజు ఆచూకీ తెలిపినవారికి పదిలక్షల రివార్డులు కూడా ప్రకటించారు.


 ఇక చిట్టచివరికి నిందితుడు రాజు రైలు పట్టాలపై విగతజీవిగా కనిపించాడు.  దీంతో రాష్ట్ర ప్రజానీకం మొత్తం హర్షం వ్యక్తం చేసింది. పోలీసులు పట్టుకుంటారు అనే భయంతో రాజు ఆత్మహత్య చేసుకొని ఉండొచ్చు అని అందరూ భావిస్తున్నారు. అయితే అంతకు ముందు అటు రాజు కుటుంబ సభ్యులందరినీ పోలీసులు విచారించారు అన్న విషయం తెలిసిందే.  అయితే చిన్నారిపై అత్యాచారం చేసి దారుణంగా హత్య చేసిన నిందితులు రాజు ఎంత క్రూరమైన వాడు అన్న విషయాన్ని ఇటీవలే రాజు మామ వెంకన్న చెప్పుకొచ్చారు. మొదట వివాహం చేసుకుని యువతిని వదిలేసిన తర్వాత తన బిడ్డను ప్రేమించి రాజు వివాహం చేసుకున్నాడని రాజు మామ వెంకన్న తెలిపారు. ఇక తన బిడ్డతో వివాహం అయిన తర్వాత ఎనిమిదేళ్ల తర్వాత పాప పుట్టింది అంటూ చెప్పుకొచ్చాడు.  అయితే తన కూతురు గర్భంతో ఉన్న సమయంలో రాజు కడుపులో తన్నేవాడని.. ఇలా తన్నడం వల్ల మూడుసార్లు గర్భస్రావం అయింది అంటూ వెంకన్న తెలిపాడు. తన కూతురు పట్ల రాజు ఎంతో క్రూరంగా ప్రవర్తించే వాడు అంటూ చెప్పుకొచ్చాడు. నేను ఇంకా చిన్నపిల్లాడిలా ఇప్పుడే నాకు పిల్లలు వద్దు అంటూ రాజు చెప్పేవాడిని తెలిపిన నిందితుడి మామయ్య వెంకన్న.. ఈ కేసులో విచారణకు పోలీసులు తమకు ఎలాంటి ఇబ్బందులకు గురి చేయలేదు అంటూ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: