భార్య భర్తలు అన్న తర్వాత చిన్నచిన్న గొడవలు జరగడం కామన్.. ఇక ఇలాంటి గొడవలు జరిగినప్పుడు సర్దుకుపోతూ సంతోషంగా జీవించాలి. కానీ ఇటీవల కాలంలో భార్య భర్తల మధ్య తలెత్తిన చిన్నపాటి గొడవలు ఎన్నో దారుణ ఘటన లకు కారణం అవుతున్నాయి అని చెప్పాలి. ఈ క్రమంలోనే కట్టుకున్నవాడే భారం గా మారిపోయాడు అంటూ ఎంతో మంది ఏకంగా ఆత్మహత్యలకు పాల్పడటం లేదా కట్టుకున్న వారిని దారుణంగా హత్య చేయడం లాంటివి కూడా చేస్తున్నారు.  భార్య భర్తల బంధం కాస్త నేటి రోజుల్లో అన్యోన్యతకు కాకుండా ప్రాణాలు పోవడానికి కేరాఫ్ అడ్రస్ గా మారిపోయింది.


 ఇక్కడ ఇలాంటి తరహా ఘటన జరిగింది. సంసారం సాఫీగా సాగిపోతుంది అనుకుంటున్న సమయంలో భార్య భర్తల మధ్య గొడవలు జరగడం ప్రారంభమైంది.  ఇటీవలే  మరోసారి భార్య భర్తలు గొడవ పడ్డారు. పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంటానని అంటూ ఒకరినొకరు హెచ్చరించు కున్నారు. ఈ క్రమంలోనే బయటకు వెళ్లిన భర్త రామకృష్ణ ఒక చోట పురుగుల మందు తాగి అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయాడు. దీంతో ఇక వీరి కోసం అటు పోలీసులు పరుగులు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. చివరకు రామకృష్ణ సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా అతని గుర్తించి ఆసుపత్రికి తరలించి ప్రాణాలు కాపాడారు పోలీసులు.  రంగారెడ్డి జిల్లా కర్తాల్ మండలంలో వెలుగులోకి వచ్చింది ఈ ఘటన. నాగర్ కర్నూలు జిల్లా కు చెందిన రామకృష్ణ మానస లకు ఏడాది కిందట పెళ్లి జరిగింది. కొన్నాళ్ళ వరకు  ఎంతో అన్యోన్యంగా ఉన్న వీరీ బంధంలో మనస్పర్ధలు రావడం మొదలయింది. దీంతో తరచూ గొడవ పడుతున్నారు. ఇటీవల మరోసారి భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. దీంతో కోపంతో భర్త రామకృష్ణ ద్విచక్రవాహనంపై బయటికి వెళ్లాడు. ఇక ఈ క్రమంలోనే పోలీసులకు ఫోన్ చేసి తన భార్య పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంటుంది అంటూ పోలీసులకు చెప్పి భార్య ఫోన్ నెంబర్ కూడా ఇచ్చాడు. ఈ క్రమంలోనే హుటాహుటిన పరుగులు పెట్టిన పోలీసులు భార్యను అదుపులోకి తీసుకున్నారు. అయితే మీ భార్య క్షేమంగానే ఉందా అంటూ పోలీసులు రామకృష్ణ కి ఫోన్ చేసి చెప్పడంతో నేను పురుగుల మందు తాగాను అంటూ షాక్ ఇచ్చాడు భర్త రామకృష్ణ. దీంతో సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా అతని కోసం పరుగులు పెట్టిన పోలీసులు చివరికి అతని ఆచూకీ లభించగా.. అతనిని వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: