మహారాష్ట్రలోని చంద్రపూర్ లో బ్లాక్‌మెయిలింగ్ వ్యవహారం వెలుగులోకి వచ్చి హాట్ టాపిక్ గా మారిపోయింది. ఓ యువకుడితో వాట్సప్ వేదికగా పరిచయం పెంచుకున్న యువతి చివరికి నగ్నంగా వీడియో కాల్ చేసింది. ఆ తర్వాత యువకుడిని కూడా బట్టలు విప్పాలి అంటూ అడిగింది. దీంతో వెనకా ముందు ఆలోచించకుండా బట్టలు విప్పాడు ఆ యువకుడు. దీంతో ఆ యువకుడి నగ్న వీడియో ను రికార్డ్ చేసి బ్లాక్మెయిల్ చేయడం మొదలుపెట్టింది. దీంతో ఒక్కసారిగా ఆ యువకుడికి ఊహించని షాక్ తగిలింది అని చెప్పాలి.
ఇక ఇదే విషయంపై ఆ యువకుడు పోలీసులను ఆశ్రయించాడు. ఇక రంగంలోకి దిగిన పోలీసులు ఆ యువతిని పట్టుకోవడానికి సర్వ ప్రయత్నాలు చేస్తున్నారు అయితే తనతో మాట్లాడుతున్నప్పుడు ఆ యువతి ముంబై నివాసి అంటూ చెప్పింది అంటూ బాధితుడు పోలీసులకు తెలిపాడు. వాట్సాప్ లో యువకుల టార్గెట్ గా చేసుకుని మెసేజ్‌లు పంపడం అందమైన ఫోటోలను వాట్సాప్ ప్రొఫైల్ గా మార్చుతు ఆకర్షించడం చేస్తూ ఉంటుంది. ఇలా అందాలతో ఎరవేసి బ్లాక్‌మెయిలింగ్‌కు దిగుతున్న ఆ యువతిని పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తుండగా ఇక ఇలాంటి మెసేజ్‌లు విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.