ఇటీవలే ఉదయం మహిళ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఇక ఈ దర్యాప్తులో భాగంగా అసలు మిస్టరీ వీడింది. భార్యపై అనుమానం తోనే భర్త దారుణంగా కొట్టి చంపాడు అన్న విషయం విచారణలో తేలింది. కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తూ ఉంటాడు యాదగిరి. అతనికి అప్పటికే పెళ్లయింది అయినప్పటికీ స్రవంతి అనే మహిళ ను రెండో పెళ్లి చేసుకున్నాడు. అంతటితో ఆగకుండా ఇక రెండవ భార్య చెల్లి తో ప్రేమ వ్యవహారం నడిపించి గుడిలో పెళ్లి చేసుకున్నాడు. స్రవంతి రేఖలది చెన్నై కాగా.. జీవనోపాధి నిమిత్తం నగరానికి వచ్చి ఉంటున్నారు.
అయితే ప్రేమ అంటూ నాటకమాడిన యాదగిరి ఇక మూడో భార్య రేఖపై ఎప్పుడు అనుమానం తో వేధింపులకు గురి చేశాడు. ఇక ఇటీవలే నిర్మాణ పనులు నిలిచి పోయిన ఒక నాలుగు అంతస్తుల భవనం వైపుగా తన మూడో భార్య రేఖ ను తీసుకొని వచ్చాడు యాదగిరి. ఇద్దరూ కలిసి అక్కడ భోజనం చేశారు. ఈ క్రమంలోనే ఇష్టం వచ్చినట్టు తిరుగొద్దు అంటూ భార్యను హెచ్చరించాడు. ఆమె వినకపోవడంతో ఇద్దరి మధ్య గొడవ అయింది. ఇక విచక్షణ కోల్పోయిన యాదగిరి దారుణంగా ఒక మూడో భార్యను కొట్టి చంపాడు అన్న విషయం పోలీస్ విచారణలో తేలింది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి