ఇలా నేటి రోజుల్లో వెలుగు లోకి వస్తున్న ఘటనలు ఆడపిల్ల జీవితాన్ని అడుగడుగునా ప్రశ్నార్థకం గానే మార్చేస్తున్నాయి. అయితే ఇక పక్కనే ఏకంగా కుటుంబ సభ్యులు ఉన్నప్పటికీ వారి పై దాడి చేసి మరీ అత్యాచారాలకు పాల్పడుతున్నారు నేటి రోజుల్లో కామాంధులు. ఇలా దేశం లో ఎక్కడో ఓ చోట ప్రతి రోజు ఆడ పిల్లలపై అత్యాచారాలు జరుగుతున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. తెలంగాణలోని కరీంనగర్ జమ్మికుంట లో ఒక దారుణమైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ఒక వివాహిత పై 12 మంది యువకులు దారుణంగా సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన స్థానికంగా కలకలం సృష్టిస్తోంది. మూడు రోజులుగా ఒక రూమ్ లో బంధించి తనపై అత్యాచారం చేశారంటూ బాధిత మహిళ ఇటీవలే పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేయడంతో ఘటన కాస్త సంచలనం గా మారిపోయింది. తనపై పైశాచికంగా ప్రవర్తించాడు అంటూ ఫిర్యాదులో పేర్కొంది సదరు మహిళ. వివాహిత ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రస్తుతం ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. 10 మంది ఆచూకీ కోసం గాలింపు చర్యలు మొదలు పెట్టారు..
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి