సాధారణంగా ప్రతి ఆస్పత్రిలో జనరల్ వార్డు ఎలా ఉన్నప్పటికీ ఐసియు మాత్రం ఎంతో శుభ్రంగా ఉంటుంది. ఎందుకంటే ఇక ఐసీయూలో పేషెంట్లు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండడానికి.. ఇన్ఫెక్షన్లు రాకుండా ఉండడానికి  పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచటమే కాదు అటు జనాలను కూడా ఎక్కువగా లోపలికి రానివ్వరు. కానీ ఇక్కడ మాత్రం ఏకంగా ఐసీయూలో ఒక రోగికి చేదు అనుభవం ఎదురైంది. ఐసీయూలో చికిత్స పొందుతున్న రోగి చేతి వేళ్లను కాలును ఎలుకలు కొరికాయ్. దీంతో తీవ్ర రక్తస్రావమైంది. ఈ ఘటన జరిగింది ఎక్కడో కాదు వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో.


 ఐ సి యూ లో ఇలాంటి తరహా ఘటన జరగడం పై మాత్రం ప్రస్తుతం బంధువులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఐసీయూలో చికిత్స పొందే పేషెంట్ పరిస్థితే ఇలా ఉంటే ఇక ఆసుపత్రిలో మిగతా వార్డులో ఉన్న పేషంట్ ల పరిస్థితి ఏమిటి అంటూ ప్రశ్నిస్తున్నారు. హనుమకొండ భీమవరానికి చెందిన శ్రీనివాస్ గత కొంతకాలంగా ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతూ ఉన్నాడు. ఈ క్రమంలోనే ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు సదరు వ్యక్తి. ఇక ఇటీవల శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది రావడంతో వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తీసుకువచ్చారు.


 ఈ క్రమంలోనే  అతన్ని ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు వైద్యులు. మొదటి రోజు అతనికి చేదు అనుభవం ఎదురైంది. తొలి రోజే అతని చేతి వేళ్లను ఎలుకలు కొరికాయ్. ఈ విషయం కుటుంబ సభ్యులు చెప్పడంతో ఇక గాయాలకు కట్టు కట్టారు. ఆ తర్వాత మరునాడు ఉదయం శ్రీనివాస్ పై ఎలుకల దాడి చేయడంతో పాటు కాలివేళ్లను కొరకడంతో  తీవ్ర రక్తస్రావమైంది. ఇక స్పందించిన వైద్యులు మళ్ళీ కట్టుకట్టి చికిత్స అందించారు. అయితే ఈ ఘటనపై మాత్రం అటు కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ విషయాన్ని ఆసుపత్రి ఆర్ఎంవో  దృష్టికి తీసుకెళ్లగా ఇక ఎలుకల నివారణకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు ఆయన..

మరింత సమాచారం తెలుసుకోండి:

Mgm