కడుపున పుట్టిన కొడుకులు కనికరం లేకుండా తల్లి దండ్రులను వదిలెస్తున్నారు..ఇలాంటి విషయాలను వింటుంటే గుండె తరుక్కు పోవడం ఖాయం.మానవత్వం ఉన్న ఎవరైనా కూడా స్పందిస్తారు.ఇప్పుడు ఓ వృద్ధ మహిళ పరిస్థితి విన్న ఎవరైనా కూడా కంటతడి పెట్టడం ఖాయం. కడుపు నిండా అన్నం పెట్టలేక 10 ఏళ్లుగా బిస్కట్స్ పెడుతూ వస్తున్నారు.. ఆమె పరిస్థితిని చూసిన కొందరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.. అందులోనూ తన కొడుకులు ఇద్దరు కూడా ప్రభుత్వ ఉద్యోగులు కావడం విశేషం.. అంత పెద్ద పొజిషన్ లో ఉండి కూడా ఇలా చేయడం అందరినీ ఆలోచనలో పడవేసింది.


వివరాల్లొకి వెళితే..ఈ అమానుష ఘటన తమిళనాడులో వెలుగు చూసింది. తల్లిని ఓ ఇంట్లో పెట్టి.. ఇద్దరు కుమారులు ఇంటికి తాళం వేశారు. ఇంట్లో బలహీనమైన స్థితిలో తన ఇంటిలో వివస్త్రగా పడి ఉన్న మహిళ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చెస్తుంది. ఈ ఘటన పై చలించిన కొందరు వ్యక్తులు అధికారులకు సమాచారం ఇవ్వడం తో ఈ దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.72 ఏళ్ల మహిళను సాంఘిక సంక్షేమ శాఖ అధికారులు శుక్రవారం రక్షించారు..


విషయాన్నికొస్తే..టైమ్స్ ఆఫ్ ఇండియాలోని ఒక నివేదిక ప్రకారం.. హెల్ఫ్ లైన్ నెంబర్ కు ఒక కాల్ వచ్చింది. వాళ్ళు వెంటనే ఆమె వున్న ఇంటికి వెళ్లారు..ఇరుగుపొరుగు వారిని విచారించగా జ్ఞానజ్యోతి అనే మహిళను ఆమె కుమారులు ఇంట్లో బంధించినట్లు తెలిసింది. దీంతో అధికారులు తలుపులు పగులగొట్టి వృద్ధురాలిని రక్షించారు.తండ్రి మరణించిన అనంతరం జ్ఞానజ్యోతిని ఆమె కుమార్తె చూసుకుంది.. అయితే తన భర్త చనిపోయిన రెండేళ్లకే కన్న కూతురు కూడా చనిపొయారు.కుమారులు వృద్ధురాలికి ఓ ఇంట్లో పెట్టి ఆ ఇంటికి తాళం వేశారు. గత 10 సంవత్సరాలుగా వారానికి ఒకసారి మాత్రమే ఆహారం, బిస్కెట్లను తల్లికి ఇచ్చేవారని ఇరుగుపొరుగు చెప్పారు.. వారిని పోలీసులకు అప్పగించారు.ఇలాంటి మృగాలను కఠినంగా శిక్షించాలని కొందరు డిమాండ్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: