ఇటీవల కాలంలో సైబర్ నేరగాళ్లు ఎంతలా రెచ్చిపోతున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అమాయకులను టార్గెట్ చేసుకుంటూ మాయమాటలతో బురిడీ కొట్టించి చివరికి ఖాతాలు ఖాళీ చేస్తున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. సైబర్ నేరగాళ్ల ఆగడాలకు అడ్డుకట్ట వేసేందుకు పోలీసులు ఎంత నిఘా పెట్టిన సరికొత్త మార్గాలను నేరాలు చేయడానికి ఎంచుకుంటున్నారు సైబర్ నేరగాళ్లు. అయితే ఇక్కడ ఒక సైబర్ నేరగాడు ఏకంగా తాత్కాలికంగా విడిపోయిన భార్య భర్తలను కలిపాడు. చివరికి పోలీసులు అతన్ని అరెస్టు చేశారు. ఈ ఘటన పంజాబ్లోని మొహాలీలో వెలుగులోకి వచ్చింది.


 సైబర్ నేరగాడు భార్యాభర్తలను కలపడం ఏంటి.. చివరికి అరెస్టు కావడం ఏంటి ఇదంతా కన్ఫ్యూజన్ గా ఉంది అని అనుకుంటున్నారు కదా. అసలు విషయం తెలియాలంటే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే. వ్యక్తిగత విభేదాల నేపథ్యంలో  భర్త నుండి దూరంగా ఉంటూ విడాకుల ప్రయత్నం చేస్తుంది మహిళా. అయితే ఈ క్రమంలో ఆమెకు ఫేస్బుక్లో మొహాలికీ చెందిన ఫర్మిందర్ సింగ్ తో పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలో ప్రతి నెల రెండు లక్షలు సంపాదిస్తున్నట్లు మాయమాటలు చెప్పి పెళ్లి ప్రస్తావన సదరు మహిళ వద్దకు తీసుకు వచ్చాడు.  డబ్బు అవసరం అంటూ 70 వేల వరకూ తీసుకున్నాడు.


 కానీ చివరికి సదరు మహిళకు అతనిపై అనుమానం వచ్చింది. ఈ క్రమంలోనే అతను చెప్పిన వివరాల ప్రకారం పరమేందర్  తండ్రిని కలిసింది మహిళ. అయితే పర్మేందర్ ఒక అవారా అని గతంలో జైలుకు కూడా వెళ్ళి వచ్చాడు అని తెలియడంతో ఒక్కసారిగా షాక్ అయింది. అతనితో వాగ్వాదానికి దిగింది. దీంతో కక్షగట్టిన అతడు మహిళతో దిగిన ఫోటోలు ఆమె భర్త కుమారుడితో పాటు వారి స్నేహితుల ఫేస్ బుక్ లకు పంపి దుష్ప్రచారం చేయడం  మొదలుపెట్టాడు. ఇలాంటి సమయంలోనే భర్త ఆమెకు దగ్గరై ధైర్యం చెప్పాడు. చివరి ఇద్దరూ కలిసి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: