ఇటీవలి కాలంలో మనుషులు మానవత్వం ఉన్న వారీలాగా కాకుండా ఏకంగా ఉన్మాదులు గా మారిపోతున్నారు ఏమో అని అనిపిస్తూ ఉంది నేటి రోజుల్లో వెలుగులోకి వస్తున్న ఘటనలు చూసిన తర్వాత. ఎందుకంటే ఇటీవల కాలంలో పరాయి వ్యక్తుల విషయంలోనే కాదు ఏకంగా సొంత వారి విషయంలో కూడా కొంత మంది దారుణంగా ప్రవర్తిస్తున్నారూ అని చెప్పాలి. ఏకంగా రక్తసంబంధం కూడా మరిచి  సొంత పిల్లలను దారుణంగా హత్యలకు పాల్పడుతున్నారు. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగు చూసింది. బీహార్లోని మాదే పుర జిల్లా లో దారుణం చోటుచేసుకుంది. శ్రీ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక వ్యక్తి తన భార్య కూతుర్ని అత్యంత కిరాతకంగా హత్య చేశాడు.


 ఈ ఘటనతో స్థానికులు అందరూ కూడా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు అనే చెప్పాలి.  ఇక తన కొడుకు మరో కూతురుతో కలిసి అక్కడి నుంచి పారిపోయాడు సదరు వ్యక్తి. రాంనగర్ పంచాయతీ పరిధిలోని పోకారియా గ్రామానికి చెందిన మహ్మద్ జుబేర్ ఇక ఈ హత్య చేసినట్లు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.  తన భార్య మూర్శిదా ఖాతూన్,మూడేళ్ల కూతురు జియా పర్వీన్ లను దారుణంగా హత్య చేశాడు. ఇలా హత్య చేసిన అనంతరం భార్య తలను పోలీస్ అవుట్ పోస్టు పరిధిలో పడేసాడు.. హత్య చేసిన అనంతరం ఆ వీడియోని రికార్డ్ చేసి వాట్సాప్ గ్రూపు లో కూడా షేర్ చేశాడు. ఇందుకు సంబంధించిన సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగి అతని ఇంటికి చేరుకున్నారు.


  అతని ఇంట్లో భార్య మొండెం కూతురు తల మొండెం ని కూడా స్వాధీనం చేసుకున్నారు అని చెప్పాలి. వాటిని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ క్రమంలోనే ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో ఉన్న నిందితులను పట్టుకునే పనిలో పడ్డారు. నిందితులను కఠినంగా శిక్షించాలని మృతురాలి తరపు బంధువులు డిమాండ్ చేస్తూ ఉండటం గమనార్హం. అయితే గతంలో సదరు వ్యక్తిని అత్తమామలు కొట్టారని... ఇది మనసులో పెట్టుకొని హత్య చేసి ఉంటాడని పోలీసులు అనుమానిస్తూ ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: