సాధారణంగా డాక్టర్ల దగ్గరికి ఎప్పుడూ ఎన్నో రకాల కేసులు వస్తూ ఉంటాయి . అందుకే రోగులకు వ్యాధులు కొత్తమో కానీ డాక్టర్లకు మాత్రం అలాంటి వ్యాధులు ప్రతి రోజూ చూస్తూనే ఉంటారు. కాబట్టి సర్వసాధారణంగా భావిస్తూ ఉంటారు. కానీ కొన్ని కొన్ని సార్లు డాక్టర్లకు సైతం షాకిచ్చే పేషెంట్లు అప్పుడప్పుడూ ఆసుపత్రులకు వస్తూ ఉంటారు అని చెప్పాలి. ఇక ఇప్పుడు మనం మాట్లాడుకునేది కూడా ఇలాంటి పేషెంట్ గురించి అనే చెప్పాలి. ఇతను తీహార్ జైలులో శిక్ష అనుభవిస్తున్న ఒక ఖైదీ.


 అయితే ఇటీవలే పెరోల్ పై బయటకు వెళ్లి మళ్లీ జైలుకు తిరిగి వచ్చాడు. జైలుకు వచ్చిన మూడు రోజుల తర్వాత అతనికి తీవ్రమైన కడుపు నొప్పి వచ్చింది. దీంతో వెంటనే అప్రమత్తమైన పోలీస్ అధికారులు ఆస్పత్రికి  తీసుకువెళ్లారు. అయితే కడుపు నొప్పి కావడంతో ఇక మొత్తం ఎక్స్ రే తీసి చెక్ చేశారు వైద్యులు. కానీ రిపోర్టులు వచ్చిన తర్వాత చూసి మాత్రం అటు డాక్టర్లకు ఇటు పోలీసు అధికారులకు మైండ్ బ్లాక్ అయ్యే విషయం తెలిసింది. అతని కడుపులో 4 సెల్ ఫోన్స్ ఉన్నాయ్ అనే విషయాన్ని గుర్తించారు అధికారులు.



 ఈ క్రమంలోనే డాక్టర్లు శస్త్రచికిత్స చేయాలని చెప్పడంతో అందుకు పోలీసు అధికారులు కూడా అంగీకరించారు. ఈ క్రమంలోనే శస్త్ర చికిత్స చేసి అతి కష్టం మీద మొబైల్స్ బయటకు తీయగా మరో రెండు మొబైల్స్ ఇంకా లోపల ఉన్నాయి.  అయితే జైల్లో ఉన్న మిగతా ఖైదీలకు సెల్ఫోన్ విక్రయించాలని ఉద్దేశంతో ఐదు సెంటీమీటర్ల కంటే తక్కువ నిడివి ఉన్న 4 మొబైల్స్ మింగేశాడు. ఇక ఈ విషయం ఎవరికీ తెలియకుండా జాగ్రత్త పడ్డాడు. 2 రోజుల తర్వాత వాటిని బయటకు తీసేందుకు ప్రయత్నించిన కుదరలేదు. చివరికి కడుపు నొప్పి వచ్చింది. దీంతో ఆస్పత్రికి తీసుకెళ్తే అసలు విషయం బయటపడింది. అయితే మరో సెల్ ఫోన్ లు తీయడానికి స్పెషలిస్ట్ టీం మరో సర్జరీ చేయబోతున్నట్లు పోలీస్ అధికారులు తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: