అయితే వీడియో లో చూసినప్పుడే కింగ్ కోబ్రా ని చూస్తే చాలు ప్రతి ఒక్కరు వెన్నులో వణుకు పుడుతుంది. ఇలాంటి పెద్ద పాము ఎక్కడైనా కనిపిస్తే ఇక అక్కడి నుంచి పరుగులు పెట్టడమే బెటర్ అని అనుకుంటూ ఉంటారు అందరూ. కానీ ఇక్కడ ఒక వ్యక్తి మాత్రం తనను కాటేసిన కింగ్ కోబ్రా పైన ప్రతీకారం తీర్చుకున్నాడు. కాటు వేసి పారిపోతున్న కింగ్ కోబ్రా ని పట్టుకుని నోటితో ముక్కలు ముక్కలుగా కొరికి చంపాడు. ఈ దారుణ ఘటన ఒడిషాలో వెలుగులోకి వచ్చింది. ఒడిశాలోని దారాదా గ్రామంలో వరి పొలం లో పనిచేస్తున్న సమయంలో సలీం ఖాన్ అనే వ్యక్తిని కింగ్ కోబ్రా కాటువేసింది.
పాముకాటుకు గురైతే ఎవరైనా సరే వెంటనే ఆసుపత్రికి వెళ్లి చికిత్స తీసుకుంటారు. కానీ సలీం ఖాన్ మాత్రం ఆ పాముని పట్టుకొని మళ్ళీ తిరిగి కాటేశాడు. నోటితో దారుణంగా కొరికి కొరికి చంపేశాడు. ఇది చూసిన స్థానికులు అందరూ భయపడి పోయారు అని చెప్పాలి. అంతటితో ఆగకుండా చనిపోయిన పామును తన మెడలో వేసుకుని గ్రామం మొత్తం తిరిగాడు. కాగా పాము కాటు తర్వాత తనకు ఎలాంటి అభ్యంతరం లేదని చెబుతున్నాడు. అయితే పాము కాటు వేసిన తర్వాత నాటు వైద్యం చేయించుకున్నట్లు సలీం చెబుతుండడం గమనార్హం.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి