ఇలా సుఖం కోసం ఏర్పడుతున్న బంధాలు చివరికి జీవితాన్ని దుర్భరం చేసేస్తూ ఉన్నాయి. ఈ క్రమంలోనే ఈ అక్రమ సంబంధాల కారణంగా హత్యలు ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయి అని చెప్పాలి. కుటుంబ సభ్యులు స్నేహితులు బంధువులు ఇలా ఎవరిని కూడా నమ్మలేని పరిస్థితి ఏర్పడుతుంది నేటి రోజుల్లో వెలుగులోకి వస్తున్న ఘటనలను చూస్తూ ఉంటే. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన జరిగింది. సాధారణంగా స్నేహితుడు అంటే కష్టాల్లో ఉన్న సమయంలో నేను ఉన్నాను అంటూ ధీమా ఇస్తూ వెన్నంటే ఉండాలి. కానీ ఇక్కడ ఒక స్నేహితుడు మాత్రం ఏకంగా కష్టాల్లో తోడు ఉండడం కాదు స్నేహితుడిని వెన్నుపోటు పొడిచాడు.
ఏకంగా ఫ్రెండ్ భార్య పైనే కన్నేసి అక్రమ సంబంధానికి తెరలేపాడు. ఈ ఘటన తమిళనాడులోని తిరుపూర్ జిల్లాలో వెలుగు చూసింది. వడివేలు అనే వ్యక్తి కుటుంబంతో నివాసం ఉంటున్నాడు. అయితే తన భార్యతో స్నేహితుడు ఈశ్వరణ్ అక్రమ సంబంధాన్ని కొనసాగిస్తున్నాడు అన్న విషయం చివరికి వడివేలుకు తెలిసింది.దీంతో కోపంతో రగిలిపోయాడు. స్నేహితుడు ఈశ్వరున్ ను మందలించిన అతని తీరు మార్చుకోలేదు. దీంతో మరో ఫ్రెండ్ అన్నదురై సహాయంతో దారుణంగా ఈశ్వరన్ ను కొట్టి చంపాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి