
ఇక ఇప్పుడు కూడా ఇలాంటి తరహా ఘటన జరిగింది అని చెప్పాలి. ఇప్పుడు వరకు పోలీసులకు ఏకంగా నేరస్తులను అరెస్టు చేసేందుకు ఆదేశాలు పొందడం లాంటివి చూశాము. కానీ ఇక్కడ మాత్రం ఏకంగా పందులను అరెస్టు చేయడానికి ఆదేశాలు వచ్చాయి. ఈ ఘటన రాజస్థాన్ లోని బిల్వారా లో వెలుగు చూసింది. మున్సిపల్ కమిషనర్ గా ఉన్న దుర్గా కుమారి ఆ జిల్లా ఎస్పీ ఆదర్ష్ సిద్దుకి ఒక లేఖ రాశారు. మున్సిపాలిటీలో 70 వార్డులలో ఉన్న వీధుల్లో ఊర పందులు స్వైర విహారం చేస్తూ ఇక పౌరుల స్వేచ్ఛ జీవితానికి అసౌకర్యం కలిగిస్తున్నాయని వాటిని అరెస్టు చేసేందుకు పోలీసుల సహాయం కావాలంటూ లేఖలో అభ్యర్థించారు.
అయితే ఈ లేఖ చూసినా ఎస్పీ ఆదర్శ్ పడి పడి నవ్వుకున్నారు. కేవలం ఎస్పీ మాత్రమే కాదు సహచర పోలీసు అధికారులు కూడా లేక చూసి ఒక్కసారిగా షాక్ అయ్యారు అని చెప్పాలి.. ఇక మున్సిపల్ కమిషనర్ ఉదంతం కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. అయితే ఆ తర్వాత తాను చేసిన తప్పిదం ఏంటో తెలుసుకున్న మున్సిపల్ కమిషనర్ మరుసటిరోజే జిల్లా ఎస్పీకి ఇంకో లేఖ రాసింది. కానీ అప్పటికే మొదట రాసిన లేక వైరల్ గా మారిపోవడంతో జరగాల్సిన నష్టం జరిగిపోయింది అని చెప్పాలి.