ఇటీవల కాలంలో మహిళలపై వేధింపులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి తప్ప ఎక్కడ తగ్గుముఖం పట్టడం లేదు అని చెప్పాలి. ఎంతోమంది కామందులు తాము మనుషులం అన్న  విషయం మరిచిపోయి ఆడపిల్ల ఒంటరిగా కనిపించింది అంటే చాలు దారుణంగా అత్యాచారాలు చేస్తున్నారు. ఇక మరి కొంతమంది టెక్నాలజీని ఉపయోగించుకుని ఎంతోమంది మహిళల ఫోటోలను మార్పింగ్ చేసి ఇక బ్లాక్ మెయిల్కు దిగుతూ శారీరక అవసరాలు తీర్చుకుంటున్న ఘటనలు కూడా వెలుగులోకి వస్తూ ఉన్నాయని చెప్పాలి.


 ఈ క్రమంలోనే ఇలా మహిళలను వేధింపులకు పాల్పడుతున్న వారిని పోలీసులు అరెస్టు చేయడం.. ఇక కోర్టులో హాజరు పరిస్తే కోర్టులు వారికి కఠిన శిక్షలు విధించడం లాంటివి చూస్తూనే ఉన్నాం అని చెప్పాలి. అయితే ఇటీవల కాలంలో ఇలా ఎంతోమంది కామాంధులు కేవలం సామాన్య మహిళల జోలికి మాత్రమే వెళ్తున్నారు. ఇలాంటి నీచులు అటు పోలీసు వృత్తిలో కొనసాగుతున్న మహిళ అధికారులు లేదంటే  జడ్జిలుగా కొనసాగుతున్న మహిళలు జోలికి వెళ్లి వేధింపులకు పాల్పడేందుకు అంతగా ధైర్యం చేయరు. కానీ ఇక్కడ మాత్రం ఇలాంటిదే జరిగింది.


 నేరస్తులకు సరైన శిక్ష విధిస్తూ  ఉన్నత స్థానంలో కొనసాగుతున్న ఒక మహిళా జడ్జికే చేదు అనుభవం ఎదురయింది. రాజస్థాన్లోని జైపూర్ లో ఒక దుండగుడు ఏకంగా మహిళా జడ్జి ఫోటోలను మార్ఫింగ్ చేసి 20 లక్షలు కావాలంటు డిమాండ్ చేయడం సంచలనంగా మారిపోయింది. దీనిపై ఆమె వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. మహిళా జడ్జి ఫోటోలను సోషల్ మీడియా నుంచి డౌన్లోడ్ చేసి వాటిని అసభ్యంగా మార్ఫింగ్ చేశాడు దుండగుడు.  ఇక ఈ ఫోటోలతో పాటు స్వీట్లు పార్సెల్ చేసి ఆమె కోర్టులో ఉండగానే పంపించాడు. అడిగిన డబ్బులు ఇవ్వకపోతే ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు. అయితే సదరు జడ్జి పోలీసులకు ఫిర్యాదు చేయగా.. సీరియస్గా తీసుకున్న పోలీసులు కేసును ఛేదించే పనిలో ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: