అంతా సాఫీగా సాగిపోతుంది అనుకుంటున్న సమయంలో కొన్ని కొన్ని సార్లు వెలుగులోకి వచ్చే ఘటనలు గుండెలు గుబేల్ మానేలా చేస్తూ ఉంటాయని చెప్పాలి. అలాంటి సంఘటనలు జరిగిన తర్వాత ఇక ప్రాణాలు గాల్లో కలిసిపోయాయేమో అని భయం వేస్తూ ఉంటుంది. ఇక అలాంటి తరహా ఘటన అప్పుడప్పుడు ప్రతి ఒక్కరి జీవితంలో జరుగుతూ ఉంటాయి. ఇక్కడ ఇలాంటిదే జరిగింది. అతను రోజు లాగానే స్కూలుకు వెళ్లి వాష్ రూమ్ డోర్ ఓపెన్ చేశాడు. ఇక ఎదురుగా కనిపించిన సీన్ చూసి ఒక్కసారిగా గుండె ఆగినంత పని అయింది. ఏకంగా ప్రాణాలు పోతాయేమో అనే భయం అతనిలో కలిగింది.


 దీంతో ప్రాణ భయంతో ఒక్కసారిగా గట్టిగా అరవడం మొదలుపెట్టాడు సదురు వ్యక్తి. ఇంతకీ ఏం జరిగింది అని తెలుసుకోవాలని ఆత్రుత పెరిగిపోయింది కదా.. ఏం జరిగిందో తెలియాలి అంటే మాత్రం కాస్త స్టోరీలోకి వెళ్లాల్సిందే. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని ఫిరోజాబాద్ లో వెలుగులోకి వచ్చింది అని చెప్పాలి. నాగ్ల పాసి గ్రామంలో ఉన్న ఒక రెసిడెన్షియల్ పాఠశాలలో 7 అడుగుల పొడవైన మొసలి స్థానికంగా కలకలం రేపింది అని చెప్పాలి. ఈ క్రమంలోనే స్కూల్లోనే టాయిలెట్ లో ఒక భారీ మొసలి ప్రత్యక్షం కావడంతో ఒకసారిగా విద్యార్థులందరూ కూడా భయంతో వనికి పోయారు.



 ఏం చేయాలో అర్థం కాక పాఠశాల బయటికి గట్టిగా అరుస్తూ పరుగులు తీశారు అని చెప్పాలి. అయితే వెంటనే అప్రమత్తమైన స్థానికులు ముసలినీ పట్టుకునేందుకు సాహసం చేయకుండా.. వెంటనే అటవీశాఖ సిబ్బందికి సమాచారం అందించారు. ఇక అక్కడికి చేరుకున్న అటవీ శాఖ సిబ్బంది రెండు గంటలపాటు శ్రమించి మొసలిని సురక్షితంగా పట్టుకుని ఇనుప బోనులో బంధించారు అని చెప్పాలి. దీంతో విద్యార్థులతో పాటు గ్రామస్తులంతా ఊపిరి పీల్చుకున్నారు. ఇక ఆ మొసలి అసలు స్కూల్ బాత్రూంలోకి ఎలా వచ్చింది అన్న విషయం అర్థం కాక స్థానికులందరూ కూడా షాక్ అవుతున్నారు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: