ఇటీవల కాలంలో వెలుగులోకి వస్తున్న ఘటనలు చూసిన తర్వాత అసలు మనిషి ఆలోచన తీరు ఎటు పోతుందో కూడా అర్థం కాని పరిస్థితి నెలకొంది అని చెప్పాలి. ఎందుకంటే ఒకప్పుడు పరాయి వ్యక్తుల విషయంలో కాస్త కఠినంగా ఉండేవాడు మనిషి. కానీ సొంత వారి విషయంలో మాత్రం ఎంతో ప్రేమ అభిమానాలు కలిగి ఉండడమే కాదు.. ఇక కాస్త మానవత్వాన్ని చాటుకునేవాడు అని చెప్పాలి. కానీ ఇటీవల కాలంలో మాత్రం ఏకంగా సొంత వారి విషయంలో కూడా కర్కశంగా ప్రవర్తిస్తున్న ఘటనలే వెలుగులోకి వస్తున్నాయి. కాస్త అయినా జాలి దయ చూపించకుండా దారుణంగా హత్యలకు పాల్పడుతున్నారు.



 దీంతో కష్ట సమయాల్లో అండగా ఉంటారు అనుకున్న సొంత వాళ్లే ప్రాణాలు తీస్తుంటే.. ఏమీ చేయలేని దీనమైన స్థితిలో పడిపోతుంది మనిషి జీవితం. వెరసీ ఎప్పుడు ఎటువైపు నుంచి ఎవరు దాడి చేసి ప్రాణాలు తీసేస్తారో అని భయపడుతూనే బ్రతకాల్సిన పరిస్థితి ప్రతి ఒక్కరికి ఏర్పడింది అని చెప్పాలి. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన జరిగింది. ఏకంగా మెట్టినింట్లో అడుగుపెట్టిన తర్వాత ఏకంగా అమ్మానాన్నల్లాగానే ఎంతో ప్రేమ గౌరవంగా చూసుకోవాల్సిన అత్తమామలను ఒక కోడలు దారుణంగా హత మార్చింది.


 ఈ దారుణమైన హత్యకు సంబంధించిన ఘటన ఢిల్లీలో వెలుగులోకి వచ్చింది అని చెప్పాలి. ఇక వృద్ధ దంపతులు కోడలు  చేతిలో దారుణ హత్యకు గురికావడం స్థానికులను ఉలిక్కిపడేలా చేసింది. ఘటనపై ఇటీవల పోలీసులు కీలక విషయాలను వెల్లడించారు. వివాహేతర సంబంధం పెట్టుకున్న నిందితురాలు మోనిక కి అటు వృద్ధ అత్తమామలకి మధ్య ఆస్తి విషయంలో గొడవ జరగడంతోనే ఇలాంటి దారుణానికి ఒడిగట్టింది అన్న విషయం హాట్ టాపిక్ గా మారిపోయింది. మోనికా ఆమె ప్రియుడుతోపాటు మరో వ్యక్తితో కలిసి ఇలా హత్య చేయగా మౌనికను.. పోలీసులు అరెస్టు చేశారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: