ఇటీవల కాలంలో ప్రతి చిన్న విషయాన్ని ఏకంగా న్యాయస్థానం వరకు తీసుకువెళ్లడం ఒక ఫ్యాషన్ గా మారిపోయింది.  ఒకప్పుడు భార్యాభర్తల మధ్య సమస్య వచ్చినప్పుడు కేవలం ఊర్లో ఉన్న పెద్ద మనుషుల మధ్య చర్చలు జరిపి.. ఇక ఆ సమస్యను సద్దుమనిగిలా చేసేవారు. ఇక ఆ తర్వాత భార్యాభర్తల మధ్య ఎలాంటి గొడవలు జరిగేవి కాదు. కానీ ఇటీవల కాలంలో మాత్రం చిన్న చిన్న విషయాలను కూడా పోలీస్ స్టేషన్ వరకు న్యాయస్థానం వరకు తీసుకువెళ్లడం సర్వసాధారణంగా మారిపోయింది అని చెప్పాలి. అయితే ఇక ఇలాంటి కేసులలో అటు న్యాయస్థానాలు ఇస్తున్న తీర్పులు కూడా సంచలనంగా మారిపోతున్నాయి. అంతేకాదు ప్రతి ఒక్కరికి ఉన్న హక్కులను గుర్తు చేస్తూ ఉన్నాయి అని చెప్పాలి. ఇక్కడ ఏకంగా అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పు కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది. భార్యాభర్తల మధ్య ఉండాల్సిన లైంగిక సంబంధం గురించి అలహాబాద్ హైకోర్టు కీలక తీర్పును వెలువరించింది అని చెప్పాలి. సాధారణంగా భార్యాభర్తల మధ్య లైంగిక సంబంధం అనేది సాదరణం. ఇలాంటి శారీరక సంబంధమే వారి బంధాన్ని మరింత బలపరుస్తూ ఉంటుంది. కానీ ఇక్కడ ఒక భర్తకు మాత్రం ఇలా శారీరక సంబంధం విషయంలో చేదు అనుభవం ఎదురయింది. అకారణంగా భార్య అతన్ని దూరం పెట్టడం మొదలుపెట్టింది. భార్య ప్రవర్తనలో మార్పు వచ్చిందని తనను దూరం పెడుతుందని.. తమ మధ్య సరైన లైంగిక సంబంధం లేదు అంటూ భర్త ఆరోపించాడు. ఈ క్రమంలోనే తన భార్య నుంచి తనకు విడాకులు ఇప్పించాలి అంటూ ఫ్యామిలీ కోర్టులో పిటీషన్ వేశాడు ఒక వ్యక్తి. అయితే ఇక ఈ ఫిటిషన్ మాత్రం అటు ఫ్యామిలీ కోర్టు కొట్టి వేసింది. కానీ అతను మాత్రం వెనక్కి తగ్గలేదు. ఏకంగా అలహాబాద్ హైకోర్టుకు వెళ్లాడు. ఈ క్రమంలోనే హైకోర్టు షాకింగ్ తీర్పు ఇచ్చింది. సరైన కారణం లేకుండా జీవిత భాగస్వామిని ఎక్కువ కాలం సెక్స్ కు అనుమతించకపోవడం మానసిక క్రూరత్వమే అంటూ హైకోర్టు స్పష్టం చేసింది. ఈ క్రమంలోనే విడాకులు మంజూరు చేస్తూ తీర్పు ఇచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: