
ఇందుకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది అన్న విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు మెట్రో మరో విషయంలో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది. మెట్రోలో ప్రయాణిస్తున్న ఇద్దరు మహిళలు దారుణంగా కొట్టుకున్నారు. ఒకరిని ఒకరు తన్నుకునేంతవరకు వెళ్లారు. ఇందుకు సంబంధించిన వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది అని చెప్పాలి. అక్కడ ఏం జరిగిందో.. కానీ ఒక యువతి బూటుతో మరో యువతిని బెదిరించింది. దీంతో కోపంతో ఊగిపోయిన మరో యువతీ ఏకంగా తన చేతిలో ఉన్న వాటర్ ప్లాస్క్కుతో మరో యువతిపై దాడికి దిగింది.
ఏకంగా వాటర్ ప్లాస్క్ లో ఉన్న నీటిని ఇలా ఆ యువతిపై పోసింది. అయితే ఇదంతా జరుగుతున్న సమయంలో.. తోటి ప్రయాణికులు కల్పించుకొని ఆ ఇద్దరినీ శాంతింప చేయడానికి ప్రయత్నించిన ఇక గొడవ మాత్రం సద్దుమనగలేదు. ఏకంగా రెచ్చిపోయి ఒకరిపై ఒకరు దారుణంగా దాడి చేసుకున్నారు. ఇక వెంటనే తోటి ప్రయాణికులు అధికారులకు ఫిర్యాదు చేశారు అని చెప్పాలి. ఇక ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారగా ఇక ఎంతోమంది నెటిజెన్స్ స్పందిస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు. ఢిల్లీ మెట్రో ఎంటర్టైన్మెంట్ కి కేరాఫ్ అడ్రస్ గా మారిందని తోటి ప్రయాణికులు ఇబ్బంది పడతారని తెలియడం లేదా అంటూ ఫైర్ అవుతున్నారు నేటిజన్స్.