నేటి ఆధునిక టెక్నాలజీకి అలవాటు పడి పోయిన మనిషి.. పూర్తిగా మోసగాడిగా మారిపోతున్నాడా అంటే వెలుగు లోకి వచ్చిన ఘటనలు చూసిన తర్వాత అందరూ అవును అనే సమాధానమే చెప్పగలుగుతున్నారు. ఎందుకంటే ఒకప్పుడు బంధాలకు బంధుత్వాలకు ఎక్కువ విలువ ఇస్తూ ఇక మోసం అనే ఆలోచన కూడా మనిషి రానిచ్చే వాడు కాదు. కానీ ఇప్పుడు సొంత వారి విషయం లోనే ఎలా మోసం చేయాలని ఆలోచననే అందరి లో కనిపిస్తూ ఉంది.



 ఈ క్రమం లోనే మంచివాళ్ళ ముసుగులో కొంతమంది ఆర్థిక అవసరాల కోసం మోసాలకు పాల్పడుతూ ఉంటే.. ఇంకొంతమంది శారీరక అవసరాలను తీర్చుకుంటూ ఎంతో మంది జీవితాలను నాశనం చేస్తున్న ఘటనలు వెలుగులోకి వస్తూన్నాయ్. ముఖ్యంగా ప్రేమ అనే ముసుగు వేసుకొని అమ్మాయిలను మోసం చేస్తున్న కేటుగాళ్ళ సంఖ్య రోజురోజుకు పెరిగిపోతూనే ఉంది. అదే సమయంలో అబ్బాయిలను మోసం చేస్తున్న కిలేడీలు లేకపోలేదు. ఇక సిరిసిల్ల జిల్లాలో కూడా ఇలాంటి ఓ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రేమిస్తున్నాను పెళ్లి చేసుకుంటాను అని గుడ్డిగా నమ్మించిన బావ చివరికి మరదలు జీవితం నాశనం చేశాడు.


 సిరిసిల్ల జిల్లాకు చెందిన యువతి ప్రైవేట్ ఉద్యోగం చేస్తూ ఉంటుంది. హైదరాబాద్లోని అమీర్పేట్ లో ఒక హాస్టల్లో ఉంటుంది. అయితే సిరిసిల్లవాసి కరుణాకర్ ఆ యువతీకి బావ అవుతాడు. ఇక అతను యూసఫ్ గూడాలో ఉంటూ తన మరదలైన ఆ యువతీని పెళ్లి చేసుకుంటాను అంటూ చెప్పి నమ్మించాడు. ఈ క్రమంలోనే  రూమ్ కి తీసుకువెళ్లి ఆమెను పలుమార్లు లోబరుచుకున్నాడు. ఇక అతన్నే పెళ్లి చేసుకుంట కదా అనే భావించి యువతీ సర్వం అర్పించింది. కానీ ఆ తర్వాత  ముఖం చాటేసి వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఈ క్రమంలోనే బాధితురాలు పోలీసులను ఆశ్రయించగా కరుణాకర్ ను అరెస్ట్ చేసిన పోలీసులు విచారిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: