ఇలాంటి తరహా ఘటనలు ఆడపిల్లలు భద్రతను రోజురోజుకు ప్రశ్నార్థకంగా మార్చేస్తున్నాయి. దీంతో ఇలాంటి ఘటన చూసిన తర్వాత ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఆడపిల్ల మళ్ళి క్షేమంగా ఇంటికి వస్తుందో లేదో అని ఆడపిల్ల తల్లిదండ్రులు ప్రతిక్షణం భయపడుతూనే బ్రతుకుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఇటీవల రాజస్థాన్లో అయితే దారుణ ఘటన వెలుగు చూసింది. ఏకంగా ఇద్దరు మైనర్ బాలికలపై లైంగిక దాడి జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. తండ్రితో కలిసి పనిచేసే ఇద్దరు వర్కర్లు మైనార్టీ బాలికలపై లైంగిక దాడికి పాల్పడ్డారు. అయితే ఇటీవల ఇద్దరు బాలికలు గర్భం దాల్చడంతో విషయం వెలుగులోకి వచ్చింది. అల్వార్ జిల్లాలో ఈ ఘటన వెలుగు చూసింది.
15 ఏళ్ళు, 13 ఏళ్లు వయసున్న తన ఇద్దరు కూతుర్లని కూడా సప్పి, సుభాన్ అనే ఇద్దరు వ్యక్తులు రేప్ చేశారని తండ్రి ఆరోపించారు. పెద్ద కూతురు కడుపులో నొప్పిగా ఉందని చెప్తే హాస్పిటల్ కి వెళ్ళామని.. డాక్టర్లు పరీక్షించి ఇక గర్భవతి అని తేల్చడంతో షాక్ అయ్యామని తండ్రి ఫిర్యాదులో పేర్కొన్నాడు. తర్వాత తండ్రి బాలికలను ప్రశ్నిస్తే సబ్బి, సుభాన్ అనే ఇద్దరు రేప్ చేసారని ఏడుస్తూ చెప్పారు. ఈ విషయం బయటకు చెబితే చంపేస్తామని బెదిరించడంతో ఎవరికి చెప్పలేదని బాలికలు తెలిపారు. ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు విచారణ మొదలుపెట్టారు. ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారిపోయింది అని చెప్పాలి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి