హైదరాబాదులో పెళ్లిళ్ల పేరుతో కొందరు ఖిలేడీలు వృద్ధులకు వల వేస్తున్నారు. ఒంటరిగా ఉన్న వృద్ధులపై కన్నేసి మోసం చేస్తున్నారు. వీరి టార్గెట్ భార్య లేని డబ్బులు ఉన్న ఒంటరి వృద్ధులు. ఒంటరిగా ఉన్న మహిళను అంటూ.. వయసుతో సంబంధం లేకుండా, బాగా చూసుకుంటే చాలు అని అబద్ధాలు చెబుతూ వృద్ధులను బుట్టలో వేసుకుంటున్నారు. అలా వారి డబ్బు బంగారాన్ని దోచేసుకుంటున్నారు.  అయితే ఈ ఖిలేడీలు ఎక్కువగా హైదరాబాదులో సంచరిస్తున్నారు. 

ఈ క్రమంలో ఇటీవలే ఇలాంటి ఒక సంఘటన హైదరాబాదులో వెలుగులోకి వచ్చింది. ఆంధ్ర ప్రదేశ్ లోని తిరువూరుకు చెందిన తాయారమ్మ అలియాస్ సరస్వతి పెళ్లిళ్ల బిజినెస్ చేస్తోంది.  ఈమెతో పాటు ఖమ్మం జిల్లాకు చెందిన కొత్తగూడెం వాసి స్వాతి కూడా బిజినెస్ లో భాగమైంది. ఇద్దరు ప్రస్తుతం హైదరాబాదులో ఉంటూ ఒంటరిగా ఉన్న వృద్ధులను ట్రాప్ చేస్తున్నారు. ఒక మ్యారేజ్ బ్యూరో పెట్టుకొని ఎన్నో అబద్ధాలు చెప్పి వీరిద్దరిలో ఒకరి ఫోటో పెట్టి మోసం చేస్తున్నారు. 

అయితే తాజాగా వీరిద్దరూ ఒక ఒంటరి వృద్ధుడిని నమ్మించి హైదరాబాద్ కు రప్పించారట. అతనితో అవసరానికి డబ్బులు పెట్టించుకున్నారు. అలాగే బంగారం చీరలు కూడా కొనిపించుకున్నారు. పెళ్లి ఖర్చులు, మండపంలో భోజనాలు అంటూ మరికొన్ని డబ్బులు కూడా తీసుకుని చెక్కేశారు. ఫోన్ చేసి పెళ్లి గురించి మాట్లాడితే.. పెళ్లి చేసుకోమని ఇబ్బంది పెడుతున్నట్లు కేసు పెడతామని బెదిరించారంట. దీంతో ఆ వృద్ధుడు పోలీస్ స్టేషన్ ని ఆశ్రయించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇకపోతే సరస్వతి భర్త ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉన్నతాధికారి హోదాలో ఉండి సస్పెండ్ అయ్యారు. స్వాతికి భర్త మరియు ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఒంటరిగా ఉన్న వారి బాలహీనతలను ఆదారంగా చేసుకుని డబ్బు దోచుకునే ఖిలేడీలు మళ్లీ మార్కెట్ లోకి ప్రత్యేక్షమయ్యారని అందరూ అప్రమత్తంగా ఉండాలని పోలీసులు చెప్పుకొచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: