పాక్ లో భారత్ ఇక్కడి దేశంలో ఉండే పౌరులపై అక్కడి ప్రజలకు మంచి అభిప్రాయం ఉండదు. భారత్ లో ముస్లింలకు, హిందువులకు అందరికీ సమానంగా హక్కులు ఉంటాయి. కానీ పాక్ లో అలా కాదు మాది ఇస్లాం దేశమని అంటారు. అక్కడ హిందువులకు సరైన హక్కులు ఉండవు. హిందువులపై అణిచివేత ఉంటుందని అంటారు.


లాహోర్ లో జరిగిన సమావేశంలో జావెద్ అక్తర్ ను అక్కడి పాక్ ప్రజలు కొన్ని ప్రశ్నలు వేశారు. అక్కడి సమావేశంలో కొంతమంది ఆయన్ని వివిధ ప్రశ్నలు అడిగారు. మీరు పాకిస్థాన్ కు చాలా సార్లు వచ్చారు. మళ్లీ ఇండియాకు వెళ్లాక పాక్ లోని ప్రజలు బాంబులు పేల్చే వారు కాదు.. పూలతో స్వాగతం పలుకుతారని ఎప్పుడైనా వారికి చెప్పారా?


ఇక్కడ ఎవరూ ఎవర్ని నిందించాల్సిన పని లేదు. ప్రజల మధ్య ద్వేషం ఏ సమస్యను పరిష్కరించదు. ఇరు దేశాల మధ్య వాతావరణం ఉత్కంఠగానే ఉంటుంది. ముంబయిలో ఉన్న మేము ఉగ్రవాదుల దాడులను కళ్లారా చూశాం. దాడికి పాల్పడిన వారు యూరప్, లండన్ నుంచి రాలేరు. వారు ఇప్పటికీ మీ దేశంలో స్వేచ్ఛగా తిరుగుతున్నారు. దీనిపై భారత ప్రజలకు ఇప్పటికీ కోపం ఉందని జావెద్ అక్తర్ అన్నారు. పాక్ దిగ్గజాలకు ఇండియాలో లభించినంత ఆదరణ, స్వాగతం భారత కళాకారులకు పాక్ లభించలేదు.


పాక్ నుంచి వచ్చిన కళాకారులకు భారత్ లో పలికిన స్వాగతం వారికి ఇచ్చిన అతిథి మర్యాదలు ఎక్కడ లభించవు. కానీ లతా మంగేష్కర్ కు పాక్ లో ఎన్నడైన గౌరవం లభించిందా? అని చురకలు అంటించారు. ఇక్కడ మాత్రం ఎలాంటి సౌకర్యాలు, గౌరవం ఉండవు. అలాంటప్పుడు అక్కడి నుంచి మాత్రం అన్ని కావాలని కోరుకుంటారు అదెలా సాధ్యమవుతుందని అన్నారు. మొత్తం మీద పాక్ ప్రజల్లో చిన్న పాటి ఆలోచన వచ్చింది. భారత్ లో పాక్ ప్రజల గురించి ఏమనుకుంటున్నారని ఆలోచిస్తున్నారంటే వారిలో కాస్తైనా మార్పు కానవస్తున్నట్లే లెక్క.

మరింత సమాచారం తెలుసుకోండి: