రాజకీయాలు, కార్పొరేట్ రంగాల్లో ఎంత టాలెంట్ ఉంటే అంత ఎదగడం చూస్తుంటాం. ముఖ్యంగా రాజకీయాల్లో టాకింగ్ పవర్, సబ్జెక్టు ఉండాల్సిన అవసరం ఉంటుంది. ప్రతిపక్షాలు చేసే విమర్శల్ని ధీటుగా తిప్పికొట్టగలగాలి. అధికార పార్టీలో ఉండే విప్ లు, పార్టీ అధికార ప్రతినిధులు ఇతర పార్టీలు చేసే విమర్శల్ని, ఆరోపణల్ని సరైన విధంగా ఎదుర్కొని వాటికి సమాధానాలు చెప్పగలగాలి.


కార్పొరేట్ రంగమైనా, రాజకీయాలు, ఇలా ఎక్కడ చూసిన నాయకత్వ లక్షణాలు కలిగిన వారిని ఆయా సంస్థలు, రాజకీయ పార్టీలు గుర్తించినపుడే వారి అనుభవం, పాండిత్యం, అన్ని బయటకు వస్తాయి. ఎన్టీఆర్ పార్టీ పెట్టినపుడు ఆయన చూపించిన తెగువ, నూతన నాయకులను తయారు చేసిన విధానం ప్రశంసనీయమైనది. కోడెల శివ ప్రసాద్, దేవినేని నెహ్రు లాంటి నాయకులకు మంచి అవకాశాలు ఇచ్చారు. కారణం మంచి వాగ్దాటి కలిగిన వారు.


విషయాన్ని ప్రజలకు అర్థమయ్యే రీతిలో వివరించగలిగే వారు. కాబట్టి వారిని ప్రోత్సహించడంతో టీడీపీలో గొప్ప నాయకులుగా ఎదిగారు. అలాగే తెలంగాణలో టీఆర్ ఎస్ పార్టీ పెట్టి చాలా మంది యువకులకు అవకాశం ఇచ్చారు కేసీఆర్. యువతలో ఉన్న నాయకత్వ లక్షణాలను గుర్తించి వారికి అవకాశాలు ఇచ్చారు. బాల్క సుమన్, గువ్వల బాలరాజు, ప్రశాంత్ రెడ్డి ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతో మందిని నాయకులుగా మార్చారు.


కారణం వారికి ప్రజల్లోకి ఏదైనా విషయాన్ని తీసుకెళ్లగలిగే శక్తి, సామర్థ్యాలు ఉన్నాయి. ఇలా ప్రతి అంశాన్ని రాజకీయాల్లో సరిగా గమనించాలి. ఈ విషయంలో జగన్ కాస్త వెనకంజ వేస్తున్నట్లే కనిపిస్తోంది. ఎంపీ రఘురామకృష్ణం రాజు చేస్తున్న విమర్శల్ని చూస్తే ఆయనను తన పార్టీలోనే ఉంచుకుంటే బాగుంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొడాలి నాని, పేర్ని నానికి ఇచ్చిన అవకాశాలు  మేకపాటి, శ్రీధర్ రెడ్డిలకు ఇవ్వలేదనే విషయం ప్రస్తుతం స్పష్టమవుతుంది. ఎందుకంటే శ్రీధర్ రెడ్డి చేసే విమర్శలకు వైసీపీ సమాధానాలు చెప్పలేని పరిస్థితిలో ఉండటమే దానికి కారణం.

మరింత సమాచారం తెలుసుకోండి: