
ప్రస్తుతం టీడీపీ నుంచి వెనిగళ్ల రాము అనే వ్యక్తి గుడివాడ నియోజకవర్గంలో క్రియాశీలకంగా పని చేస్తున్నారు. అయితే అతడికి టికెట్ ఇస్తున్నారో లేదో తెలియని పరిస్థితి. వాస్తవానికి గుడివాడలో సింపథి రావికి ఉంది. ఏళ్ల తరబడి కష్టపడ్డాడు అనే మాట ప్రజల్లోకి వెళ్లిపోయింది. దేవినేని నెహ్రు చేతిలో ఓడిపోతూ వచ్చిన యలమంచిలి నాగేశ్వరరావు చివరకు గుడివాడలో గెలుపొందారు. సానుభూతి, ప్రజాభిమానం రెండు కలగలిసి ఆయన విజయం సాధించారు.
వైసీపీ నుంచి కొడాలి నాని, కాంగ్రెస్ నుంచి మంత్రిగా చేసిన పిన్నమనేని కూడా ఇక్కడి నుంచి పోటీలో దిగేందుకు సిద్ధంగా ఉన్నారు. టీడీపీ నుంచి రాము ఇలా ఎవరి ప్రయత్నాల్లో వారు ఉన్నారు. పిన్నమనేనిది పక్కన ఊరు కాబట్టి కలిసొస్తుందని ఆశిస్తున్నారు. పిన్నమనేని, రావి, వెనిగళ్ల రాము కూడా టీడీపీ నుంచి గుడివాడ టికెట్ ఆశిస్తున్నారు. కానీ ఈ ముగ్గురు మొన్నీ మధ్య ఒకే వేదికపై కలిశారు. ఐక్యంగా ఉన్నామని చాటేందుకు టీడీపీ చేసిన ప్రయత్నాల్లో ఇదొకటి.
కొడాలి నాని కూడా గుడివాడలో స్ట్రాంగ్ గానే ఉన్నారు. కానీ మొన్నటి వరకు మంత్రి పదవి ఉన్న సమయంలో ఆయన చంద్రబాబుపై చేసిన వ్యాఖ్యలు చాలా మందిని ఇరిటేషన్ కు గురి చేశాయని తెలుస్తోంది. టీడీపీ కూడా ఎలాగైనా నానిని ఓడించాలని పట్టుదలతో ఉన్నట్లు తెలుస్తోంది. మరి టీడీపీ గుడివాడలో వచ్చే ఎన్నికల్లో గెలుస్తుందా లేదా అనేది చూడాలి.