పంజాబ్‌లో వేర్పాటు వాదం అనేది పతాక స్థాయికి చేరిందని తెలుస్తుంది. మొన్నటివరకు పబ్లిక్ లో ఇది పెద్దగా లేదు కానీ అది ఇప్పుడు పబ్లిక్ లో కూడా పాకినట్టు తెలుస్తుంది. ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే దేశాన్ని విభజించాలనుకునే కలిస్తానీవాదులతో వీళ్ళు కూడా ఏకీభవిస్తున్నట్లు తెలుస్తుంది. వాళ్ళ భావాలతో వీళ్ళు కలుస్తున్నట్లుగా తెలుస్తుంది. పాకిస్తాన్ ప్లాన్ పనిచేస్తుందేమోనని సందేహం వస్తుంది కొంతమందికి ఒక సంఘటనను బట్టి.


మొన్న ఒక చిన్న పాప వాళ్ళ తండ్రితో కలిసి అక్కడికి వెళ్ళింది. అప్పుడు వాగా సరిహద్దులో డబ్బులు తీసుకుని మన ఇండియా ఫ్లాగ్ స్టిక్కర్స్ అంటిస్తారట, పెయింటింగ్స్ కూడా వేస్తారట మూడు రంగుల జెండాలవి. అలా వాళ్లు స్టిక్కర్స్ వేయించుకుని వాగా సరిహద్దులోకి వచ్చి లోపలికి వెళ్ళబోతుంటే వెనక్కి పంపించేశారట అక్కడ వారు. ఎందుకంటే మీరు భారతీయులు అని చెప్పి వెనక్కి పంపించబోయారట.


అప్పుడు వాళ్ళు పంజాబ్ భారత్ లోదే కదా మళ్ళీ ప్రత్యేకంగా ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు అంటే, అప్పుడు దానికి వారు ఇచ్చిన సమాధానం ఆ చిన్నపిల్ల తండ్రిని షాక్ కి గురి చేసిందట.  బోర్డర్లో వాళ్ళు ఏం సమాధానం చెప్పారంటే పంజాబ్ భారత దేశంలోది కాదు, పంజాబ్ వేరు, భారత్ వేరు అని. ఇది వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్. మీరు భారతీయులుగా పంజాబ్ కి వస్తున్నారు. మీరు ఆ స్టిక్కర్స్ తీసేస్తేనే లోపలికి రండి అని వాళ్ళు అన్నా కూడా ఆ పాప స్టిక్కర్స్ తీసేయడానికి ఒప్పుకోక వెనక్కి వెళ్లిపోయారట వాళ్ళు.


ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. పైగా దాన్ని పంజాబ్ వాళ్ళు సమర్ధించుకుంటున్నారు. అంటే ఒకప్పటి కాశ్మీర్ సమస్య లాంటిది ఇప్పుడు పంజాబ్ కి వచ్చిందని తెలుస్తుంది‌. ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళు అక్కడ ఒక దంపుడు ఉపన్యాసాలు ఇస్తారు, దేశభక్తి వాళ్ళకి విపరీతంగా ఉందంటారు. కానీ వాళ్లు ఇదంతా ఎందుకు మార్చలేకపోతున్నారు అని అడుగుతున్నారు కొంతమంది.

మరింత సమాచారం తెలుసుకోండి: