మే 22, 23, 24తేదీల్లో కాశ్మీర్ లోని శ్రీనగర్ లో జీ20 సమావేశాలు జరుగబోతున్నాయి.  ఈ జీ20 సమావేశానికి ప్రపంచంలోని టాప్ 20దేశాలు రాబోతున్నాయి. అత్యంత కీలకమైన దేశాలైన అమెరికా, రష్యా, చైనా కూడా రాబోతున్నాయని తెలుస్తుంది. వాటి తర్వాత స్థానంలో ఉన్న మరో 30 దేశాలు కూడా ఈ సమావేశానికి రాబోతున్నాయట. అంటే మొత్తంగా 50 దేశాల వరకు ఈ సదస్సుకు రాబోతున్నాయని అంటున్నారు.


టూరిజం ఆధారంగా అక్కడ  మూడు రోజులపాటు జరగబోయే ఈ సదస్సులో ఆతిధ్యం ఇవ్వబోతుంది భారతదేశం. అయితే దీన్ని అడ్డుకునేందుకు ఇప్పటి వరకు తీవ్రవాదులు పెద్ద ఎత్తున భారత సైన్యంపై దాడి చేశారు. రెండుసార్లు జరిగిన దాడులలో 10మంది సైనికులు వీరమరణం పొందారు. ఆపరేషన్ త్రినేత్ర పేరుతో మన సైన్యం బొరియల్లో దాక్కున్న వారిని కూడా వెతికి మరీ వేటాడుతుంది. అయినా కూడా కాశ్మీర్లో ఈ సదస్సు జరగకూడదని పాకిస్తాన్ వాళ్ళు ఈ 50దేశాలని జి20 సదస్సుకు రావద్దన్నారు.


కాశ్మీర్లో ఈ సదస్సు జరగకూడదని ఎందుకు అనుకుంటున్నారు అంటే రేపు ఈ సదస్సుకి వచ్చిన 50దేశాల వాళ్ళు కాశ్మీర్ ని భారత భూభాగం అని అంటారేమో అనే అనుమానంతో అని తెలుస్తుంది. టర్కీ, చైనా దేశాలు తప్ప మిగిలిన వాళ్ళందరూ అక్కడికి వస్తున్నట్లుగా తెలుస్తుంది. ఓపెక్ దేశాలకి పెద్దన్నలాంటి సౌదీ అరేబియాని కూడా వెళ్ళద్దని బ్రతిమాలింది పాకిస్తాన్.  సౌదీ అరేబియా యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్ మోడీకి అత్యంత సన్నిహితుడు.


అంతేకాకుండా పాకిస్తాన్ ని ఎక్కువగా నెత్తిన పెట్టుకోదలుచుకోలేదు సౌదీ అరేబియా. ఇప్పుడు సౌదీతో పాటు అరబ్ దేశాలు బాధ్యతాయుతంగా ఎదగకపోతే ఇక శాశ్వతంగా ఆఫ్రికా దేశాల్లా మారిపోతాయని తెలుస్తుంది. దానివల్ల భవిష్యత్తులో పెట్రోల్, డీజిల్ వాడకాలు తగ్గిపోతాయి. అందుకని అందరితోనూ స్నేహంగా ఉండాలని 50దేశాలు వచ్చేటువంటి ప్రాంతాన్ని వదులుకునేందుకు సిద్ధంగా లేని సౌదీ అరేబియా పాకిస్తాన్ పిలుపుకి స్పందించకుండా కాశ్మీర్లోని జీ20 సదస్సుకు వస్తున్నట్లుగా తేల్చి చెప్పేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: