నవరత్నాలు పథకాల ప్రచారంతో వైసీపీ రాష్ట్రంలో అధికారం చేపట్టింది. ఇందులో సంపూర్ణ మద్య నిషేధం అనేది మధ్యలోనే ఆగిపోయింది. జాబ్ క్యాలెండర్ పక్కన పెట్టేశారు. ఈ రెండు మినహా మిగతా పథకాలు ప్రజలకు అందుతున్నాయి. గతంలో జగన్ నవ రత్నాలు అందిస్తామని పాదయాత్ర సమయంలో చెప్పినపుడు దానిపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్ర విమర్శలు చేశారు. జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ జగన్ హామీలపై విమర్శలు గుప్పించారు.


ప్రస్తుతం చంద్రబాబు నాయుడు మహానాడులో ప్రజలపై ఉచిత హామీల వర్షం కురిపించారు. టీడీపీ కూడా దూసుకుపోతున్న తరుణంలో జనసేన సైలెంట్ పై ఊహగానాలు విడిచిపెట్టాలని ఆ పార్టీ అధికార ప్రతినిధి శ్రీనివాస్ కూసుంపూడి మాట్లాడుతూ.. జనసేన పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి అందరూ కృషి చేయాలని పొత్తులపై అపోహాలు, అనుమానాలు విడనాడాలని కోరారు. మోసపోవడానికి ఇది ప్రజారాజ్యం పార్టీ కాదని ఎత్తులకు పై ఎత్తులు వేసే జనసేన అని అన్నారు.


ప్రస్తుతం  పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ప్రణాళిక బద్ధంగా అడుగులు వేస్తున్నారు. రాబోయేది రాష్ట్రంలో జనసేన ప్రభుత్వం, పవన్ కల్యాణ్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారని ఢంకా బజాయించి చెబుతున్నారు. అయితే పవన్ కల్యాణ్ స్వయంగా సీఎం పదవి నాకు అవసరం లేదని, ఎలాగైనా వైసీపీని జగన్ ను సీఎం పదవి నుంచి గద్దె దించాలని కోరుకుంటున్నట్లు గతంలోనే ప్రకటించారు.


బీజేపీ, టీడీపీ జనసేన గురించి పవన్ కల్యాణ్ ను సీఎంగా ఎవరూ ప్రకటించారు. టీడీపీలో చంద్రబాబు, లోకేశ్ ఉండగా జనసేన అధినేతకు సీఎం పదవి ఎలా ఇస్తారు. అసలు ఇలా చెప్పమని జనసేన పార్టీ అధికార ప్రతినిధికి ఎవరూ చెప్పి ఉంటారు. ఇలా చెప్పడం ద్వారా జనసేన కార్యకర్తలు ధైర్యం కోల్పోకుండా ఉంటారని అనుకుంటున్నారని తెలుస్తోంది. టీడీపీ, జనసేన పొత్తు కుదిరితే వైసీపీ కష్టమే. కానీ టీడీపీ, జనసేన సీఎం గురించి కొట్టుకుంటే  చివరకు వైసీపీ గెలిచే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: