సీఎం జగన్ ఢిల్లీ పర్యటనలో ప్రధానాంశం పోలవరం అనే విషయం అందరికీ తెలుసు. ఆంధ్రప్రదేశ్ జీవనాడిగా పేరున్న పోలవరం ప్రాజెక్ట్ పనులు కేంద్రం ఇచ్చే నిధులతోనే ముడిపడి ఉన్నాయి. అయితే చంద్రబాబు హయాం నుంచి ఈ ప్రాజెక్ట్ కొత్త కొత్త టార్గెట్ లు పెట్టుకుంటూ సాగుతూనే ఉంది. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కాంట్రాక్ట్ సంస్థలు మారడంతో మరోసారి వ్యవహారం మొదటికొచ్చింది. అయితే 2022నాటికి పోలవరం ఎట్టి పరిస్థితుల్లోనూ పూర్తి చేస్తామనేది జగన్ ధీమా.