సాక్షి పత్రిక ఆంద్రజ్యోతి పత్రికకు గత టిడిపి ప్రభుత్వం అతి తక్కువ ధరకు భూమిని కేటాయించిందంటూ ఓ కథనం ప్రచురించింది. ఆంధ్రజ్యోతి యాజమాన్యానికి చెందిన ఆమోద పబ్లికేషన్స్ లిమిటెడ్‌కు గత ప్రభుత్వం విలువైన భూమిని కారుచౌకగా కేటాయించిందని ఆ కథనంలో తెలిపింది.