టికెట్లు జారీ చేయటంలో ఏపిఎస్ఆర్టీసీ తొందరపడిందా ? క్షేత్రస్ధాయిలో జరిగిన విషయాలను గమనిస్తే అవుననే అనిపిస్తోంది. ఏప్రిల్ 14వ తేదీతో మూడు వారాల లాక్ డౌన్ పూర్తవుతుంది. అయితే ఆ తర్వాత లాక్ డౌన్ కంటిన్యు అవుతుందా ? లేకపోతే ఎత్తేస్తారా ? అన్న విషయం దేశమంతా సందిగ్దంలో ఉంది. ఇటువంటి సమయంలోనే ఏపిఎస్ఆర్టసీ తొందరపడి ప్రయాణీకులకు టికెట్లు బుక్ చేసుకోమని చెప్పటంతో సమస్య మొదలైంది.

 

ఉన్నతాధికారుల ప్రకటనతో హైదరాబాద్-విజయవాడ మధ్య రానుపోను భారీగా టికెట్లు బుక్కైపోయాయి. అలాగే హైదరాబాద్ నుండి ఏపిలోని వివిధ ప్రాంతాలతో పాటు ఏపిలోని అనేక ఊర్ల నుండి హైదరాబాద్ కు టికెట్లను జనాలు బుక్ చేసుకున్నారు. ప్రయాణీకులు టికెట్లు బుక్ చేసుకోవటం అయిపోయిన తర్వాత ఇపుడు ఆ టికెట్లన్నింటినీ క్యాన్సిల్ అంటున్నారు ఉన్నతాధికారులు. లాక్ డౌన్ కాలంలోనే ఏప్రిల్ 14 తర్వాత ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో తెలీకుండానే అసలు ఆర్టీసీ ఉన్నతాధికారులు టికెట్లను ఎలా జారీ చేశారో అర్ధం కావటం లేదు.

 

టికెట్లను బుక్ చేసుకోవటంలో అసలు ఆర్టీసీకి ఇందుకింత తొందర ? అసలు లాక్ డౌన్ ఎందుకు విధించారో ఉన్నతాధికారులకు తెలీదా ? లాక్ డౌన్ పీరియడ్ లో కూడా ఒకవైపు కరోనావైరస్ తీవ్రత పెరిగిపోతున్న విషయం ఉన్నతాధికారులు చూడటం లేదా ? ఒకవైపు కేసుల సంఖ్య పెరిగిపోతుంటే మరోవైపు లాక్ డౌన్ ఎత్తేస్తారని ఎలా అనుకున్నారు. రైలు టికెట్ల విషయంలో ఐఆర్సీటిసి ప్రకటననే ఆర్టీసీ ఉన్నతాధికారులు ప్రామాణికంగా తీసుకున్నట్లున్నారు.

 

లాక్ డౌన్ ఎత్తేయాలా ? లేకపోతే కంటిన్యు చేయాలా ? అనే విషయాన్ని డిసైడ్ చేయాల్సింది ఐఆర్సీటిసి కాదు కదా ? ఇపుడు ఆర్టీసీ ఓపెన్ చేసిన బుకింగ్ లో 42,377 టికెట్లు బుక్కయ్యాయి. వీటిల్లో హౌదరాబాద్-విజయవాడ మధ్యే సుమారు 7 వేల టికెట్లున్నాయి. ఏప్రిల్ 15వ తేదీన 27, 247 టికెట్లు, 16న 11,305, 17న 2542, 18న 791, 19వ తేదీన 431, 20 61 టికెట్లు బుక్కయ్యాయి. ఇపుడు వాటన్నింటినీ ఉన్నతాధికారులు క్యాన్సిల్ చేసేస్తున్నారు. ఎందుకు బుక్ చేసినట్లు ? ఎందుకు క్యాన్సిల్ చేస్తున్నట్లు ?

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: