వైజాగ్ అంటేనే ప్ర‌శాంత‌త‌కు మారుపేరు. ఓ వైపు స‌ముద్రం అల‌ల‌తో చ‌ల్ల‌ని వాతావ‌ర‌ణంతో అంతా ప్ర‌శాంతంగా ఉంటుంది. ఇక ఏపీ సీఎం జ‌గ‌న్ వైజాగ్‌ను కూడా రాజ‌ధానిగా ప్ర‌క‌టించ‌డంతో వైజాగ్‌కు ఇప్పుడు ప్ర‌పంచ ప‌ఠంలోనే మంచి గుర్తింపు ల‌భిస్తోంద‌ని వైజాగ్ వాసులు ఎంతో ఆనందంతో ఉన్నారు. ఇంత‌లోనే వ‌చ్చిన క‌రోనా వైర‌స్ వైజాగ్ న‌గ‌ర వాసుల‌ను అల్లాడిస్తోంది. ముందుగా వైజాగ్‌లో క‌రోనా స్వైర‌విహారం చేసినా జ‌గ‌న్ ప్ర‌భుత్వం అహ‌ర్నిశ‌లు శ్ర‌మంచి ఎంతో క‌ష్ట‌ప‌డి వైజాగ్‌లో క‌రోనాను క‌ట్ట‌డి చేసింది.

 

అన్ని ప్ర‌శాంతంగా ఉన్నాయి అనుకుంటోన్న టైంలో గురువారం ఉద‌యం ఎల్జీ కంపెనీ నుంచి వెలువ‌డిన స్టైరైన్ విష‌వాయువు వైజాగ్‌ను అల్ల‌కల్లోలం చేసింది. మొత్తం 11 మంది చ‌నిపోగా.. ప‌రోక్షంగా ఈ ప్ర‌భావం మూడు వేల మందిపై ఉంటుంద‌ని లెక్క‌లు వేస్తున్నారు. ఇక గురువార‌మే మ‌న రాష్ట్రంలో కాకుండా ప‌క్క రాష్ట్రాలు అయిన ఛ‌త్తీస్‌ఘ‌డ్‌తో పాటు త‌మిళ‌నాడులోనూ ఇదే త‌ర‌హాలో మ‌రో రెండు ప్ర‌మాదాలు జ‌రిగాయి. త‌మిళ‌నాడులో ఛ‌త్తీస్‌ఘ‌డ్ పేప‌ర్ మిల్లులో గ్యాస్ లీక్ కాగా.. త‌మిళ‌నాడులో బాయిలర్ పేలి ఏకంగా ఏడుగురికి గాయాలు అయ్యాయి. 

 

ఇక వైజాగ్‌లో ప్ర‌స్తుతం ఉన్న ప‌రిస్థితుల నేప‌థ్యంలో ఇంకా ఎవ‌రైనా గ్యాస్ పీల్చి అస్వ‌స్థ‌త‌తో బాధ‌ప‌డుతుంటే వారి ఈ చిన్న చిట్కాల‌తో ఉప‌శ‌మ‌నం పొంద‌వ‌చ్చ‌ని నిపుణులు చెపుతున్నారు. ప్ర‌స్తుతం గ్యాస్ ప్ర‌భావానికి గురైన బ‌ట్ట‌లే శ‌రీరం మీద ఉంటే వాటిని తీసేసి మ‌న శ‌రీరాన్ని ఒక‌టి కి రెండు సార్లు శుభ్రంగా క‌డుక్కోవాలి.. వెంట‌నే కొత్త బ‌ట్ట‌లు వేసుకోవాలి. ఇక క‌ళ్ల‌ను నీళ్ల‌తో లేదా సెలైన్‌తో క‌డుక్కోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఎక్కువ మందికి ఈ గ్యాస్ వ‌ల్ల క‌ళ్లు మండుతున్నాయి. అవ‌కాశం ఉన్నంత వ‌ర‌కు బ‌య‌ట స్వ‌చ్ఛమైన గాలి పీల్చుకోవ‌డంతో పాటు శ్వాస‌కు ఇబ్బందిగా ఉంటే ఆక్సిజ‌న్ తీసుకోవాలి.

 

ఇక ఈ గ్యాస్ ప్ర‌భావం మ‌హా అయితే 10 గంట‌ల లోపు వ‌ర‌కే ప్ర‌భావం చూపుతుంది. ఆ స‌మయంలో వీలైన‌న్ని నీళ్లు తాగితే మూత్రం ద్వారా ఈ అవ‌శేషాలు బ‌య‌ట‌కు వెళ్లిపోతాయి. ఇక ఆందోళ‌న‌లో ఉన్న వాళ్లు వీలైనంత వరకు కళ్ళు ముట్టుకోకూడదు,శరీరం మీద గీరకూడదు. వికారం, వాంతులు ఉంటే నూనె ప‌దార్థాలు తీసుకోకూడ‌దు. 
 

 

మరింత సమాచారం తెలుసుకోండి: