రాజ‌కీయాల్లో మాజీ మంత్రి, టీడీపీ సీనియ‌ర్ నాయ‌కుడు దేవినేని ఉమామ‌హేశ్వ‌ర‌రావు స్ట‌యిలే వేరు! ఇ త‌ర నాయ‌కులు త‌మ జోలికి వ‌చ్చిన ప్ర‌త్య‌ర్థుల‌పై కౌంట‌ర్లు విసురుతుంటారు. కానీ, టీడీపీలో దేవినేని మా త్రం త‌నంత‌ట త‌నే కెలికి మ‌రీ ప్ర‌త్య‌ర్థులతో ముష్ఠి ఘాతాలు తింటుంటార‌ని అంటారు. నిన్న మొ న్న‌టి వ‌ర‌కు కృష్ణాజిల్లాకు చెందిన మంత్రి కొడాలి నానితో నువ్వెంతంటే.. నువ్వెంత‌? అనే రేంజ్‌లో వి మ‌ర్శ‌లు చేసిన దేవినేని.. కొడాలి సూటి కౌంట‌ర్‌తో సైలెంట్ అయిపోయిన విష‌యం తెలిసిందే. స‌న్న బియ్యం ఇస్తామ‌ని ఎన్నిక‌ల‌కు ముందు జ‌గ‌న్ వాగ్దానం చేశాడని దేవినేని చెప్ప‌డంతో కొడాలి ఫైర్ అయిన విష‌యం తెలిసిందే.

 

నిజానికి ఆ ఎఫెక్ట్ నుంచి దేవినేని ఇంకా కోలుకోలేదు. దీంతో అప్ప‌టి నుంచి ఆయ‌న కొడాలి శాఖ గురించి కానీ, ఆయ‌న వ్య‌వ‌హారం గురించి కానీ, ఒకర‌కంగా చెప్పాలంటే.. జిల్లా రాజ‌కీయాల గురించి కానీ ప‌ట్టించు కోవ‌డం మానేశారు. దీంతో ఇటీవ‌ల కాలంలో సోష‌ల్ మీడియాలోను, సైట్ల‌లోనూ దేవినేనిపై కామెంట్లు, వార్త‌లు బాగా త‌గ్గిపోయాయి. అయితే, తాజాగా ఆయ‌న పోతిరెడ్డి హెడ్ రెగ్యులేట‌ర్ వివాదంపై స్పందిస్తూ.. విష‌యాన్ని ప‌ట్టించుకోకుండా లూప్‌లైన్‌లు వెతికారు. టీడీపీ అధికారంలో ఉన్న‌స‌మ‌యంలోనే పోల‌వ ‌రం వంటి ప్రాజెక్టుల‌ను 75 శాతం పూర్తి చేశామ‌ని, జ‌గ‌న్ ప్ర‌భుత్వం వ‌చ్చాక క‌నీసం ఇటు పుల్ల అటు పెట్ట ‌లేద‌ని విమ‌ర్శించారు.,

 

దీంతో ప్ర‌స్తుతం నీటి పారుద‌ల శాఖ‌ మంత్రిగా మంత్రిగా ఉన్న నెల్లూరు సిటీ ఎమ్మెల్యే, వైసీపీ ఫైర్ బ్రాం డ్ అనిల్ కుమార్‌ యాద‌వ్ రంగంలోకి దిగాడు. మాట‌ల తూటాలు పేల్చ‌డంలో వైసీపీకి ఉన్న ఫైర్ బ్రాం డ్ల‌లో ఈయ‌న ఏమాత్రం తీసిపోరు. కొడాలి రేంజ్‌లోనే స‌వాళ్లు రువ్వుతారు. మీసం మెలేస్తాడు. అదేస్థా యిలో కౌంట‌ర్లు విసురుతాడు. ఇప్పుడు దేవినేని ఈయ‌న‌కు త‌గులుకున్నాడు. అంతే! ఊరుకుంటాడా? అనిల్ త‌నేంటో చూపించేశాడు. పోల‌వ‌రం ప్రాజెక్టు 70శాతం అయినా.. పూర్తి అయింద‌ని నిరూపిస్తే.. నేను మీసం తీసుకుని తిరుగుతాను.. లేక‌పోతే,, నువ్వు మీసం తీసుకుని తిరుగుతావా? అంటూ.. దేవినేనికి అనిల్ విసిరిన స‌వాల్ సంచ‌ల‌నంగా మారింది.

 

దీంతో దేవినేని అనుచ‌రులు.. వెళ్లి వెళ్లి అనిల్‌తో ఎందుకు పెట్టుకున్నావ‌న్నా.. అని ఉమాను త‌లంటేస్తున్నార‌ట‌!  కొడాలి, అనిల్ విమ‌ర్శ‌ల‌తో ఆయ‌న చెవులు వాచిపోతున్నాయ‌ట‌. మొత్తానికి ఇప్పుడు దేవినేని పెద్ద చిక్కుల్లోనే ప‌డ్డాడ‌ని అంటున్నారు. నిరూపించాలంటే.. పోల‌వ‌రంలో ప‌నులు జ‌ర‌గ‌లేదు... నిరూపించ‌క‌పోతే.. మీసం తీసుకోవాలి..ఏం చేయాలి! అంటే.. తాజాగా ఆయ‌న ప‌రివారం చెప్పిన స‌ల‌హా.. ఓ నెల రోజులు మీడియా ముందుకు రావ‌ద్ద‌ని! ట‌!! మ‌రి దేవినేని ఏం చేస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: