ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో రాజ్యసభ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. వైసీపీ అభ్యర్ధులు పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణ, అయోధ్య రామిరెడ్డి, పరిమళ్ నత్వానీ ఘన విజయం సాధించారు. మొత్తం 175 మంది ఎమ్మెల్యేల్లో 173 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఏసీబీ కేసులో అరెస్టైన అచ్చెన్నాయుడు, మరోవైపు హోమ్ క్వారంటైన్‌లో ఉన్న అనగాని సత్యప్రసాద్‌లు తమ ఓటు హ‌క్కును వినియోగించుకోలేక పోయారు. పోలైన ఓట్లను మొత్తంగా చూసుకుంటే వైసీపీకి మొత్తం 151 ఓట్లు ప‌డ‌గా, టీడీపీకి మాత్రం 17 ఓట్లు మాత్ర‌మే వ‌చ్చాయి. అలాగే టీడీపీ రెబెల్ ఎమ్మెల్యేలు కరణం బలరాం, మద్దాలి గిరి, వల్లభనేని వంశీ, టీడీపీ ఎమ్మెల్యే అదిరెడ్డి భవానిలు మొదటి ప్రాధాన్యత స్థానంలో 1 అని పెట్టాల్సిన చోట టిక్ మార్క్ పెట్టారు. దీంతో వీరి ఓటు చెల్లకుండా పోయాయి.

 

ఇక జనసేన పార్టీ ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ ఎప్పటి నుండో జగన్, వైసీపీకి మద్దతు తెలుపుతున్న సంగతి తెలిసిందే.  పలుసార్లు బాహాటంగా జగన్ పాలన బాగుందని ఆయనకు పాలాభిషేకాలు చేసిన రాపాక పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మాటని కూడా కాదని అసెంబ్లీలో ఒక కీలక బిల్లు విషయంలో జగన్ సర్కారుకు మద్దతు పలికారు. అలాగే రాజ్యసభ ఎన్నికల సమయంలో కూడా వైసీపీకే ఓటు వేశారు రాపాక. దీన్ని తీవ్రంగా పరిగణించిన జనసేన అధినేత పవన్ ఆయన్ను పార్టీ నుండి సస్పెండ్ చేసే యోచనలో ఉన్నట్లు రాజకీయ వర్గాలు తెలిపాయి. వాస్తవానికి పవన్ ఆయన్ను ఎప్పుడో దూరం పెట్టారు. జనసేన శ్రేణులైతే రాపాక తమ ఎమ్మెల్యే అనే సంగతినే మర్చిపోయారు.

 

అందుకే.. అసెంబ్లీలో ఏం మాట్లాడినా మాట్లాడకపోయినా.. పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనకపోయినా.. పవన్ పట్టించుకోవడం లేదు. కానీ, తన పార్టీ ఎమ్మెల్యేగా అసెంబ్లీలో కొనసాగుతూ.. తాను నిత్యం విరుచుకుపడే వైసీపీకి ఓటు వేయడంపై పవన్ తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు జనసేన వర్గాలు చెప్తున్నాయి. దీంతో అయ్యన్న పార్టీ నుండి సస్పెండ్ చేయాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం. ఒకవేళ ఆయన టీడీపీకి అనుకూలంగా ఓటు వేసుంటే పవన్ ఇదే నిర్ణయం తీసుకునేవారా..? అనే ప్రశ్నలు వైసీపీ కాంపౌండ్ నుంచి వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: