ఇంగ్లండ్‌లోని డెర్బీలో ఉన్న కెడరస్టీన్ హాల్ ఇది. ప్రస్తుతం ఇది బ్రిటన్ నేషనల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించబడుతోంది. ఇలాంటి అనేక పురాతన భవనాలను బ్రిటన్ ప్రభుత్వం నిర్వహిస్తోంది. అయితే ఇప్పుడు ఈ భవనం గురించి ఎందుకు చెప్పుకుంటున్నామంటే.. ఈ భవనం నిర్మితమైంది.. భారతీయుల నుంచి పీడించిన సొమ్ముతో.. మన భారతీయుల రక్త మాంసాలను ఉడికించిన సొమ్ముతోనే ఈ భవనం కట్టారు.

ఈ విషయం చెబుతున్నది ఎవరో భారతీయులు కాదు.. బ్రిటీష్ చరిత్రకారులే ఈ విషయాన్ని ఇటీవల ఓ అధ్యయనంలో చెప్పారు.. లార్డ్ కర్జన్ పేరు విన్నారా.. భారత స్వతంత్ర్యపోరాటంలో ఈ పేరు కనిపిస్తుంది. భారతీయులను విభజించు పాలించు అనే సిద్ధాంతంపై విడదీయాలని ప్రయత్నించిన మొదటి గవర్నర్ జనరల్ లార్డ్ కర్జన్.. ఈ భవనం ఈయనదే.. ఈయన తన హయాంలో కట్టించినదే.

లార్డ్ కర్జన్ కలకత్తా ప్రావిన్స్ కు గవర్నర్ జనరల్ గా పని చేశాడు. ఆ సమయంలో భారతీయులను దోచి ఆ సంపదను ఇంగ్లండ్ తరలించాడు. ఆ సొమ్ముతో ఇలాంటి భవనాలు నిర్మించారు. అంతే కాదు.. భారతీయులను దోచిన సొమ్ముతో అప్పట్లో బ్రిటీష్ పాలకులు విలాస వంతమైన జీవితం గడిపేవారు.మరో విశేషం ఏంటంటే.. లార్డ్ కర్జన్ వంటి వారు బ్రిటన్‌ మొదట్లో చాలా సామాన్య పౌరులేనట. వాళ్లు ఉద్యోగంపై ఇండియా వచ్చిన తర్వాత విచ్చలవిడిగా సంపాదించుకుని బ్రిటన్‌లో కోటలు కట్టుకునేవారు. అలాంటి వారిని చూసి అప్పట్లో మిగిలిన బ్రిటన్ జాతీయులు కూడా కుళ్లు కునేవారట.

చరిత్ర పుటల్లో దాయబడిన ఈ ఘోరాలన్నీ ఇప్పుడు వెలుగు చూస్తున్నాయి. ఈ విషయాలన్నీ తాజా అధ్యయనాల్లో వెల్లడవుతున్నాయి.  విశాల దృక్పథం కలిగిన చరిత్ర కారులు.. తమ బ్రిటన్ అరాచక చరిత్రను ఇప్పుడు లిఖిస్తున్నారు. ఇందుకు తామేమీ సిగ్గుపడటం లేదని.. తమ చరిత్రను తమకు అనుకూలంగా రాసుకోవాలనుకోవడం లేదంటూ వాస్తవాలు ప్రపంచానికి వెల్లడిస్తున్నారు. కొందరు బ్రిటిషర్లు మాత్రం ఇలాంటి అధ్యయనాల వల్ల బ్రిటన్ పరువు పోతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: