‘తొందరలో జరగబోయే తిరుపతి లోక్ సభ ఉపఎన్నికలో బీజేపీ ఎలాగైనా గెలిచితీరాలి’ ఇది తాజాగా బీజేపీ కోర్ కమిటి సమావేశంలో తీసుకున్న నిర్ణయం. సమావేశంలో నిర్ణయమైతే తీసుకున్నారు కానీ గెలుపు ఎలా సాధ్యం. ఎలాగైనా గెలిచితీరాల్సిందే అని పదిమంది నేతలు కూర్చుని నిర్ణయం తీసుకుంటే సరిపోతుందా ? క్షేత్రస్ధాయిలో పార్టీ పరిస్ధితి ఏమిటో అందరికీ తెలుసు. పట్టుమని వంద ఓట్లు తెచ్చేంత సీన్ అధ్యక్షుడు సోమువీర్రాజుతో సహా ఏ నేతకు కూడా లేదు. మరలాంటపుడు కమలంపార్టీ తిరుపతి ఉపఎన్నికలో ఎలా గెలుస్తుంది ? దీన్నే అత్యాస అంటారు. ఉట్టికెగరలేనమ్మ స్వర్గానికి ఎగురుతానని అన్నదనే సామెత ఇలాంటి వాటిల్లో నుండి పుట్టుకొచ్చింది. మొన్నటి ఎన్నికల్లో బీజేపీ అభ్యర్ధికి వచ్చిన ఓట్లు 16500 మాత్రమే. వీళ్ళకన్నా నన్ ఆఫ్ ది ఎబోవ్ (నోటా)కు వచ్చిన ఓట్లు 25వేలు.




పై ఓట్లను బట్టి బీజేపీ వాస్తవ బలమెంతో అందరికీ అర్ధమైపోతోంది. రాబోయే ఎన్నికల్లో మహాఅయితే ఇంకొన్ని ఓట్లు అదనంగా తెచ్చుకునే అవకాశం ఉందంతే. జనసేన+బీజేపీలు నిజాయితీగా కష్టపడితే మహాఅయితే మిత్రపక్షాల అభ్యర్ధికి 50 వేల ఓట్లు దాటే అవకాశం మాత్రమే ఉందన్నది క్షేత్రస్ధాయిలోని నేతల అంచనా. నిజం మాట్లాడుకోవాలంటే మొన్నటి ఎన్నికల్లో రెండుస్ధానంలో నిలబడిన తెలుగుదేశంపార్టీకి వచ్చిన ఓట్లు కూడా వచ్చే అవకాశం లేదు. మొన్నటి ఎన్నికల్లో  గెలిచిన వైసీపీ అభ్యర్ధికి సుమారు 7 లక్షల ఓట్లొస్తే ఓడిపోయిన టీడీపీ అభ్యర్ధికి 4.8 లక్షల ఓట్లొచ్చాయి. అన్నీ నియోజకవర్గాల్లోను గట్టి నేతలుండి, పార్టీకి కమిటెడ్ గా పనిచేసే బలమైన క్యాడర్ ఉన్న టీడీపీనే ఓడిపోయింది. అలాంటిది పార్టీ బ్యానర్ తప్ప నేతలు లేని, క్యాడర్ కూడా లేని పార్టీ గెలవాలంటే నమ్మే వాళ్ళు ఎవరైనా ఉంటారా ?




ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే తన బలమెంతో కమలంపార్టీ నేతలకు బాగా తెలుసు. గట్టిగా మాట్లాడితే బీజేపీకి డిపాజిట్ వచ్చే అవకాశం కూడా లేదు. అయినా గెలిచి తీరాల్సిందే అని తీర్మానించారంటే ఏమిటర్ధం ? ఏదో రకంగా హల్ చల్ చేయాలని డిసైడ్ అయినట్లున్నారు. తెలంగాణాలో గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీ అద్యక్షుడు బండి సంజయ్ ఎంత కంపు చేశాడో అందరికీ తెలిసిందే. భాగ్యలక్ష్మి దేవాలయమని, ఓల్డ్ సిటిలో సర్జికల్ స్ట్రైక్ అని పదే పదే ప్రకటనలు చేసి జనాల్లో మతపరమైన భావోద్వేగాలు రెచ్చగొట్టిన విషయం తెలిసిందే.  అదే సూత్రాన్ని ఏపిలో కూడా అమలు చేయాలని బహుశా బీజేపీ అనుకుంటున్నట్లుంది. ఇప్పటికే జనాలు భగవద్గీత పార్టీ కావాలా ? బైబెల్ పార్టీ కావాలా ? అంటు బండి తిరుపతి లోక్ సభ పరిధిలోని ఓటర్లను ఉద్దేశించి చేసిన ప్రకటన అందరికీ తెలిసిందే. జనాల్లో భావోద్వేగాన్ని రగల్చకపోతే జనాలు తమను పట్టించుకోరనే విషయం కమలంపార్టీ నేతలకు తెలిసిపోయింది. సరే ఉపఎన్నికలో గెలుపును పక్కనపెట్టేస్తే  కంపు చేయటం మాత్ర గ్యారెంటీగా అర్ధమైపోతోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: