ఓడిపోవడమో గెలిచి రావడమో అన్నవి జీవితం ఇస్తుందా?లేదా ఓ సంస్థ వీటిని పరిగణిస్తుందా? ఆత్మ విశ్వాసాన్ని ఆలంబనగా చేసుకుని పరిశోధన రంగాలకు చెందిన సంస్థలు ఇస్రో కానీ డీఆర్ డీఓ కానీ.. ఆ రెండు సం స్థలూ ఈ దేశాన్ని మున్ముందుకు నడిపే శక్తులు. ఓ ప్రయోగం విఫలం అయితే ఓ కల చెదిరితే ఆ సంస్థలు తమ నిబ్బరాన్ని కోల్పోవు..తమపై ఈ దేశ ప్రధాని ఈ దేశ ప్రజలు ఉంచిన నమ్మకాలనో విశ్వాసాన్నో ఎన్నటికీ స్మ రించుకుంటూనే కొత్త కొత్త ప్రయోగాలకు అవి నాంది పలుకుతాయి. గగనపు వీధులలో ఎగిరే త్రివర్ణ పతాకమా నీకు వందనం.. ఎ బిగ్ సెల్యూట్ టు ఇస్రో .. శివన్ సర్ ఐ యామ్ విత్ వి ఆర్ విత్ యూ
జీఎస్ఎల్వీ - ఎఫ్ - 10 ప్రయోగం విఫలం అయిందన్న బాధ లేదు.అసలు ఎన్నో వైఫల్యాలు దాటి ఈ రోజు ఈ దశకు చేరిన ఘనతే మాకొక వరం.శుభ పరిణామం కూడా! ఇస్రో కాదు ఎవ్వరూ విఫలం అవ్వరు..మరో కొత్త ప్ర యత్నం ముంగిట పలకరించి వస్తుంది.నేనూ మీరూ అంతా ఆనందిస్తారు.అంత వరకూ చేసేందుకు సరిపడిన ఆలోచనలు ఉన్నాయి..కదలివచ్చేందుకు సరిపడినంత ఊహలూ ఉన్నాయి.ఎన్నింటినో విస్తృతం చేసేందుకు లేదా చేయాలనుకునేందుకు పడిన తపన తప్ప ఇస్రోకు ఇంకేం కావాలి.మనం కూడా దేశానికి బాసటగా నిలిచే ప్రతి సందర్భంలోనూ ఇస్రో లాంటి అంకిత భావంతో పనిచేసే పరిశోధన సంస్థలకు బాసటగా ఉండడమే బా ధ్యతగా భావించాలి. ఎస్ ఎట్ దిస్ మూమెంట్ డియర్ ఇస్రో వి ఆర్ విత్ యూ...
వాస్తవానికి పీఎస్ఎల్వీని ట్రబుల్ షూటర్ అంటారు. జీఎస్ ఎల్ వీని నాటీ బోయ్ అంటారు. మన తెలంగాణ మాండలికంలో చెప్పుకుంటే గడుసు పోరడు అని అంటారు. ఈ సారి ప్రయోగ రీత్యా ఉన్న అవరోధాల కారణంగా జీ శాట్ - 1 ఉపగ్రహం అనుకున్న లక్ష్యాలను చేరుకోలేకపోయింది. క్రయోజనిక్ దశలోనే ఆగిపోయింది.ఇంకా ఏవేవో వార్తలు వస్తున్నాయి.వార్తలు సరే మనం ఇప్పటిదాకా ఈ దేశం కోసం గ్రహాంతర అన్వేషణ కోసం లేదా సమా చార వ్యవస్థల పటిష్టత కోసం ఇస్రోం ఏం చేసిందో ఏనాడయినా మాట్లాడుకున్నామా.. మనకు చంద్రయాన్ లాంటివే కనిపిస్తయ్ సర్ కానీ అంతకుమించిన కృషి మేం చేస్తాం.. కానీ మీరు గుర్తించరు అంటూ ఓ శాస్త్రవేత బాధప డ్డారు ఓ సందర్భంలో.. ఎన్నో సందర్భాల్లో వైద్య,వ్యవసాయ సంబంధిత పరిశోధనలకూ సంబంధిత అభివృద్ధికీ ఇస్రో చేసిన కృషిని వదిలి ఈ రోజు మనం అయ్యో ఓడిపోయిందే అనడంలో భావ్యత ఉందా..అసలు అలా ఎలా అనుకోగలం..దేశం గర్వించే క్షణాలే కాదు దేశం అండగా నిలిచే క్షణాలు కూడా ఓ పరిశోధన సంస్థ కు ఎంతో అవసరం. అవును! మనో నిబ్బరాన్ని పెంచేందుకు ఆకాశమే హద్దుగా ప్రయాణించేందుకు కొన్ని మానవ శక్తుల మద్దుతు ఇస్రో కు అవసరం.
- రత్నకిశోర్ శంభుమహంతి శ్రీకాకుళం
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి