రైతులను మోసం చేయడంలో సి.బి.ఐ. దత్తపుత్రుడు జగన్ రెడ్డిని మించినవాళ్లు ఉండరని జనసేన ఆరోపిస్తోంది. వాస్తవంగా వైకాపా చెప్పిన ప్రకారం రాష్ట్ర ప్రభుత్వ నిధులకు కేంద్ర ప్రభుత్వం నిధులు కలిపితే ప్రతి రైతుకు రూ.19,500 రావాలని... కానీ ఇస్తోంది రూ.13,500 మాత్రమేనని జనసేన పార్టీ విమర్శిస్తోంది. ఒక్కో రైతు మీదా రూ.6 వేలు జగన్ ప్రభుత్వం మిగుల్చుకొంటోందని... దీనికి ఏం సమాధానం చెబుతారని జనసేన నేత నాదెండ్ల మనోహర్‌ ప్రశ్నించారు.


రాష్ట్రంలో కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకొంటుంటే నిమ్మకు నీరెత్తినట్లు ఉన్న జగన్ తాను రైతు బిడ్డను అని చెప్పుకొంటున్నందుకు సిగ్గుపడాలని జనసేన నేత నాదెండ్ల మనోహర్‌ అన్నారు. జగన్ చంచల్ గూడ బిడ్డ అని అందరికీ తెలుసునన్న జనసేన నేత నాదెండ్ల మనోహర్‌.. గణపవరంలో ముఖ్యమంత్రి చేసిన ప్రసంగం తమ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ చేపట్టిన కౌలు రైతు భరోసా యాత్రపై అక్కసు వెళ్లగక్కడానికే సరిపోయిందన్నారు. పరిహారం అందని ఒక్క రైతు కుటుంబాన్నీ చూపలేకపోయారని అనడం ముఖ్యమంత్రి అవగాహనరాహిత్యాన్ని వెల్లడిస్తోందని జనసేన నేత నాదెండ్ల మనోహర్‌  మండిపడ్డారు.


అనంతపురం, పశ్చిమగోదావరి, కర్నూలు జిల్లాల్లో పవన్ కళ్యాణ్ పర్యటించి 200 కౌలు రైతు కుటుంబాలను పరామర్శించారని జనసేన నేత నాదెండ్ల మనోహర్‌  గుర్తు చేశారు. వారికి రూ.లక్ష చొప్పున ఆర్థిక సాయం చేశారని.. ఈ 200 మంది కౌలు రైతులు కాదు అని సీఎం చెప్పగలరా? అని జనసేన నేత నాదెండ్ల మనోహర్‌ ప్రశ్నించారు. కౌలుకి భూమి తీసుకొని అప్పుల పాలై ఆత్మహత్య చేసుకొన్నారు అని పోలీసు రికార్డుల్లో స్పష్టంగా రాశారని.. వీరికి జీవో 102, 43లను అనుసరించి ఎందుకు రూ.7 లక్షలు ఇవ్వడం లేదని నాదెండ్ల మనోహర్ ప్రశ్నించారు.


మెజారిటీ కేసుల్లో త్రిసభ్య కమిటీ సభ్యులు కూడా ఆత్మహత్య చేసుకున్నవారి కుటుంబాల దగ్గరకు వెళ్ళడం లేదని నాదెండ్ల మనోహర్  విమర్శించారు.. కొన్ని కుటుంబాలను త్రిసభ్య కమిటీ విచారించి లక్ష పరిహారం ఇచ్చి సరిపెట్టారని నాదెండ్ల మనోహర్ అన్నారు. కౌలు రైతు కాని పక్షంలో అధికారులు వెళ్ళడం, కంటి తుడుపుగా పరిహారం ఇవ్వడం చేయరు కదా అని నాదెండ్ల మనోహర్  ప్రశ్నించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: