
అయితే ఈ 3 ప్లస్ 2 అత్యంత ముఖ్యమైనవి. 11 జిల్లాల్లో ఆల్రెడీ 13వ తారీఖున మొన్న సెలవు ఇచ్చేశారు. ప్రైవేటు ఉద్యోగులకు అయితే పర్మిషన్లు కూడా ఇచ్చారు. 13వ తేదీ సాయంకాలం వరకు మద్యం అమ్మకాలు కూడా ఆపేశారు. టీచర్స్, గ్రాడ్యుయేట్స్ వీళ్లే ఇక్కడ అత్యంత కీలకమైన వాళ్ళు. వీటిలో టీచర్స్ లో ఓడినా పెద్ద ఇష్యూ కాదు వైసిపికి. కానీ గ్రాడ్యుయేట్స్ దాంట్లో టిడిపి గెలిచిందంటే మాత్రం ఇక వైసిపికి తిరోగమనము అనే ప్రమాదం ప్రారంభమైనట్లే అనే అర్ధం చేసుకోవాలి.
టిడిపి మూడు గెలిస్తే కనుక వైసిపి పని అయిపోయినట్లే, రెండు గెలిస్తే పతనానికి మూడు వంతులు దగ్గరికి వచ్చేసినట్టు, ఒకటి గెలిచిందంటే దమ్కీ ఇచ్చే స్థాయికి వచ్చినట్టు అర్థం. అదే టీచర్స్ దాంట్లో ఓడిపోయింది అంటే అర్థం టీచర్స్, ప్రభుత్వ ఉద్యోగుల అభిప్రాయం పాలక ప్రభుత్వం మీద అదే అని తేలిపోతుంది.
ఇక జగన్ ని దెబ్బ కొట్టబోతున్నారనే దానికి సంకేతం అది. ఒకటి ఒకటి గెలిస్తే కనుక ఉద్యోగులు ప్రభుత్వానికి వ్యతిరేకం అనే ఫీలింగ్స్ పోతాయి. ఒకవేళ రెండు వైసీపీని గెలిస్తే అసలు గొడవే ఉండదు. అదే ఐదు వైసిపి గెలిచిందంటే తెలుగుదేశం పార్టీ రేపు వెనుకా ముందు చూసుకోవాల్సిన పరిస్థితి అయితే ఏర్పడుతుంది.