మొన్న ఎమ్మెల్సీ కోటా ఎన్నికలు ఏవైతే జరిగాయో అక్కడ వైసీపీ ఓటమికి అయితే పవన్ కళ్యాణ్ కి ఎటువంటి సంబంధం లేదని, అది చంద్రబాబు వ్యూహం అని తెలుస్తుంది. కానీ గ్రౌండ్ లెవెల్లో జరిగిన గ్రాడ్యుయేట్, టీచర్స్ ఇంకా స్థానిక ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో స్థానిక ఎమ్మెల్సీలలో 80 శాతం వరకు వైసిపి గెలుచుకుంది, 80 శాతం వరకు వారికి ఉన్నారు కాబట్టి అది సాధ్యమైంది.


వైసిపి చక్కటి స్కెచ్ ద్వారా ఆ ఎలక్షన్స్ లో గెలిచినట్టు తెలుస్తుంది. కానీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్లో స్కెచ్ వేసినా అది ఫలించినట్టు కనపడలేదు. ఒక పక్కన మూడుకు మూడు క్లీన్ స్వీప్ చేసేసింది తెలుగుదేశం పార్టీ. జనసేన పోటీ చేయకపోవడం వల్లే వైఎస్ఆర్సిపి  గెలిచిందని ఒకవైపు మాట్లాడుతూ ఉంటే, రెండోవైపు ఓడిన స్థానాలకు వచ్చేసరికి ఇది పవన్ కళ్యాణ్ దెబ్బ జగన్ కి అని ఇంకొంతమంది అంటున్నా గానీ తెలుగుదేశం మాత్రం ఎమ్మెల్సీ ఎలక్షన్ల సందర్భంగా పవన్ కళ్యాణ్ సపోర్ట్ అని, జనసేన అని గాని ఒక్క మాట కూడా మాట్లాడలేదు.


వాస్తవంగా ఆయన బిజెపిని నేను సపోర్ట్ చేశాను ఎమ్మెల్సీ ఎలక్షన్లో అంటే బిజెపికి సంబంధించిన మాధవ్ మాత్రం మాకు ఎవరు సపోర్ట్ చేయలేదన్నారు. దాంతో అక్కడ జనసేనకు ఉనికి కూడా లేకుండా పోయిన పరిస్థితి. కానీ వాళ్ళ అనుకూల మీడియాలో ఇది అంతా జనసేన ఎఫెక్ట్ అంటుంటే దాన్ని వైయస్సార్ వాళ్ళు వెటకారం చేస్తున్నారు. కానీ చంద్రబాబుని గతంలో జనం నమ్మలేదు, జగన్ ని నమ్మారు.


ప్రజలు ఇప్పుడు పవన్ కళ్యాణ్ ని నమ్ముతుంటే, పవన్ కళ్యాణ్ జగన్ ని ఓడించడానికి మాత్రమే కాన్సన్ట్రేషన్ పెట్టి ప్రభుత్వ వ్యతిరేకతను రేకెత్తించడంలో సక్సెస్ అయ్యారు. దాని పర్యవసానం తెలుగుదేశం పార్టీ విజయం సాధించింది, జనసేన పోటీ చేయకపోవడం వల్ల.  వైఎస్సార్సీపి ఓడిపోవడానికి, తెలుగుదేశం ఊపుకు పవన్ కళ్యాణ్ కారణమయ్యారనే విషయంలో అతిశయోక్తి లేదంటున్నారు కొంతమంది.

మరింత సమాచారం తెలుసుకోండి: