
ఐటీ నోటీస్ నేరుగా చంద్రబాబు దగ్గరికే వచ్చింది. పిఎ శ్రీనివాస్ దగ్గర దొరికిన డబ్బుల వ్యవహారం నేపథ్యం విషయంలో అన్నటువంటి వ్యవహారాన్ని వీళ్లు డిస్క్లోజ్ చేసుకుంటూ వచ్చారు. 2019 నవంబర్ లో పిఏ శ్రీనివాస్ కి143 కోట్ల డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయంటే, మనోజ్ అనే షాపోంజి సంస్థకు చెందిన వ్యక్తి దగ్గర్నుంచి సంపాదించారని, అతనిని పిలిచిన చంద్రబాబు స్వయంగా శ్రీనివాస్ తో మాట్లాడమంటే, శ్రీనివాస్ ఇలా డబ్బులు కావాలంటే దాదాపుగా 3కంపెనీల పేర్లు ఇచ్చారు.
వినయ్ అనే వ్యక్తి పేరు మీద హయగ్రీవ, అనాల్, షకల్ అనే మూడు దొంగ కంపెనీలు సృష్టించారని. మిక్కీ జైన్ అనే పేరు మీద నావలిన్, ఎవరెస్ట్ అనే రెండు కంపెనీలను సృష్టించారని, సంస్థ ఇందులో హయగ్రీవకు 52కోట్లు, నావలిన్ కు 42కోట్లు ఇలా ఈ అన్ని కంపెనీలకి కలిపేసి 143 కోట్ల పంపింగ్ చేశారని, వాస్తవంగా ఇది రాజధాని ప్రాంతంలో హైకోర్టు నిర్మాణంతో పాటుగా, కీలక భవనాలకు సంబంధించి టిడ్కో ఇళ్లకు సంబంధించినటువంటి ఇందులో 15 కోట్ల రూపాయల దాకా దుబాయ్ లో చంద్రబాబుకి అందాయంటున్నారు.
ఈ డబ్బులు షాంపోజి ద్వారా పంపించి, అక్కడ నుండి యోగేష్ గుప్తా అని ఒక వ్యక్తి ఈ మొత్తం అంతా డీల్ చేస్తే కృష్ణా, నారాయణ, శ్రీకాంత్, బలాట అనే వ్యక్తులందరూ ఈ డబ్బుల్ని కలెక్ట్ చేసుకున్నారని, అలా వాళ్ళ నుండి చంద్రబాబుకు అందాయని ఆయన పేర్కొంటున్నారు.