ప్రపంచమంతా ఆర్థిక సంక్షోభం వైపు నడుస్తుందని, ప్రపంచానికి ఒక భారతదేశం మాత్రమే ఆశాదీపంలా కనిపిస్తుందని ఐఎంఎఫ్ అంటే ఇంటర్నేషనల్ మోనిటరీ ఫండ్ సంస్థ లెక్కలు వేసి మరీ చెబుతుంది. ప్రపంచపు అభివృద్ధి అనే రన్నింగ్ రేస్ లో  భారతదేశం ముందు ఉందని అది చెబుతుంది. అభివృద్ధి దశలో భారతదేశం ముందుకు వెళ్తుంటే, అద్వాన్న దశలోకి బ్రిటన్ దేశం వెళుతుందని అది చెప్పింది.


జర్మనీ రెసిషన్ ని ఫేస్ చేయబోతుందని చెప్పింది. అభివృద్ధి లెక్కల ప్రకారం భారతదేశం ఈ ఏడాది అంటే 2022-23లో 5.9% అభివృద్ధి సాధిస్తే, 2023-24లో 6.8% అభివృద్ధి  సాధించబోతుందని ఐఎంఎఫ్ చెప్పింది. ఇంతకు ముందటి సంవత్సరంలో అంటే 2021-22లో, 2022-23లో 6.1% అభివృద్ధి చెందుతుందని అనుకుంటే ఆ అభివృద్ధి 5.9% దగ్గర ఆగిపోయింది. అంటే 0.2% తగ్గింది.


కానీ ప్రపంచంలో నెంబర్ వన్ లోనే ఉంది. అలాగే నెక్స్ట్ ఇయర్ 6.3% గ్యారెంటీ వస్తుందని వీళ్ళు పక్కాగా చెబుతున్నారు. 2022-23 మొదట్లో 6.8 అనుకున్నారు, కానీ అది 6.1 దగ్గర నుండి 5.9 దగ్గరకి వచ్చి ఆగింది. ఇదేవిధంగా వచ్చే ఏడాది అది 6.3శాతం అభివృద్ధిగా ఉంటుందని లెక్క కట్టారు. అదే సందర్భంలో అమెరికా 1.6%, యూరో జోన్ మొత్తం 19 దేశాలు కలిసి 0.8 శాతం అభివృద్ధి చెందే అవకాశం ఉందని, రష్యా అభివృద్ధి శాతం 0.7 శాతంగా ఉండనుందని, చైనా 5.2 శాతం అభివృద్ధి ఉంటుందని లెక్కలు వేసుకొచ్చారు.


అంటే చైనాకి ఈ ఏడాది 5.2 శాతం అభివృద్ధి ఉందని, వచ్చే ఏడాది కూడా అదే కంటిన్యూ అవుతుందని ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ సంస్థ వాళ్ళు వేస్తున్న లెక్క. ఇలా ప్రపంచం మొత్తం అభివృద్ధిని పరిశీలిస్తే గనుక వాటన్నిటిలో కూడా భారతదేశం మాత్రమే అభివృద్ధి పరంగా ముందు అంజలో ఉందని ఈ ఐఎంఎఫ్ సంస్థ వాళ్ళు తమ లెక్కలు వివరించి చెప్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: