ఆయన వ్యతిరేకించే వర్గంలో మొట్టమొదటిగా సినిమా పరిశ్రమకు సంబంధించిన వాళ్ళు కనిపిస్తున్నారు. టికెట్ రేట్ల విషయంలో, అదనపు షోల విషయంలో గతంలో ఆయన చేసిన రూల్స్ వల్ల సినిమా వాళ్లు ఇబ్బంది పడిన విషయం తెలిసిందే. అప్పటినుండి ఆయన పై సినిమా ఇండస్ట్రీలో కొంత వ్యతిరేకత అనేది పెరిగిందని తెలుస్తుంది. అలాగని ఆయనను అభిమానించే వాళ్లు కూడా సినిమా ఇండస్ట్రీలో లేకపోలేదు. వ్యతిరేకించే వాళ్ళు తక్కువ ఉన్నా సరే వాళ్ళ అభిమానులు ఓటింగ్ టైంలో ఇన్ఫ్లూయన్స్ అవుతారని తెలుస్తుంది.
ఇక గవర్నమెంట్ ఉద్యోగుల విషయానికి వచ్చేసరికి ఐఆర్ 18 నుండి తాను వస్తే 27 కి పెంచుతానాని చెప్పారు గతంలో. కానీ దాన్ని 23 కే సెటిల్ చేశారు ఇప్పుడు. అంతేకాకుండా ఉద్యోగుల డ్యూటీ టైం విషయంలో ఫోటోలు తీయడం, సరిగ్గా జాబ్స్ చేసుకోమని చెప్పడం వీటిపై కూడా వాళ్ళు గుర్రుగా ఉన్నారని తెలుస్తుంది. జీతాలు ఫస్ట్ తారీఖున పడకపోవడం, పెన్షన్లు కూడా సరిగ్గా అందకపోవడంతో వాళ్లు కొంత అసంతృప్తితో ఉన్నారని తెలుస్తుంది.
ఇక రియల్ ఎస్టేట్ విషయానికి వస్తే బ్రోకర్ నుండి బిల్డర్ వరకు ఆయనపై అసంతృప్తిగా ఉన్నట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే ఇసుక రేట్లు పెరగడం, వాళ్ల బిజినెస్ సరిగ్గా జరగకపోవడంతో వాళ్లు కూడా తీవ్ర ఆగ్రహావేశాలతో ఉన్నట్లుగా తెలుస్తుంది. గతంలో భారతీయ జనతా పార్టీ, జనసేన వర్గాలలోని టిడిపిని వ్యతిరేకించే వాళ్ళు జగన్ కి ఓట్లు వేసి మరి గెలిపించారు. కానీ ఈసారి ఆ అవకాశం ఉండదని తెలుస్తుంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి