అమరావతి అంశంలో జగన్  ఆర్ ఫై జోన్ సాధించడమే అతి పెద్ద విజయం. చంద్రబాబు కూడా రాజకీయంగా అమరావతిని వాడుకున్నారని ఆరోపణలు వచ్చాయి. సీఎంగా చంద్రబాబు ఉన్నప్పుడు మొత్తం అమరావతి 33 వేల ఎకరాలు ఉండాలని నిర్ణయించారు. వాస్తవంగా 5 వేల ఎకరాలు ఉంటే సరిపోతుందని చాలా మంది అన్నారు. దాన్ని కాదని బాబు ప్రజల నుంచి 33 వేల ఎకరాలను తీసుకున్నారు. రూ. 5 లక్షలకు తీసుకున్న భూములను  ఆ తర్వాత దాన్ని 20, 30 లక్షల నుంచి కోటి రూపాయలు పలికే అవకాశం ఉంటుంది.


రాజధాని కాబట్టి అమాంతం భూముల ధరలు పెరిగితే లాభం ఉంటుందని అనుకున్నారు. మరో అంశం ఆంధ్రప్రదేశ్ కు  ఒక రాజధాని కట్టించాడనే పేరు ఉంటుందని ఆయన భావించారు. అమరావతి విషయంలో జగన్ ని అడుగడుగునా అవమానించారు. సీఎం జగన్ ను అమరావతి ఏరియాలో ఇబ్బందులకు గురి చేశారు. పాదయాత్ర చేసిన తర్వాత పసుపు నీళ్లతో కడిగి వేశారు. అమరావతి అంటేనే కేవలం ఒక పార్టీ సొత్తు అనే విధంగా మార్చారు. ఆ పార్టీకి బానిసత్వం చేస్తేనే ఉంటామనే విధంగా చేశారు.  అమరావతి అంటే అందరిదీ కావాలి.


కానీ ఒక పార్టీ సొత్తు అనేలా చేశారు. మంగళగిరి, ప్రత్తిపాడు, తాడికొండ, మూడు చోట్ల వైసీపీ గత ఎన్నికల్లో గెలిచింది. పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని నిర్ణయించారు జగన్. ఇక్కడికి దాదాపు లక్ష పాతిక వేల మందికి ఇళ్లు కట్టించాలని అనుకున్నారు. దీంతో కొత్తగా ఓటర్లు వస్తారు. అప్పుడు ఈ మూడు ప్రాంతాల్లో గెలవడానికి వైసీపీకి అవకాశం ఉంటుంది. ఈ విధంగా ఇళ్లు ఇవ్వకుండా ప్రతిపక్ష పార్టీలు ఇళ్ల పట్టాలు ఇవ్వకుండా కోర్టులకు వెళ్లారు. అయినా చివరకు సుప్రీం కోర్టులో జగన్ కే అనుకూలంగా తీర్పు వచ్చింది. దీంతో అక్కడ దాదాపు లక్ష పాతిక వేల మందికి ఇళ్ల స్థలాలు అందనున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: