
ఒక సామాన్య కుటుంబం ఈజీగా ఉండొచ్చు. జగన్ మచిలీపట్నంలో నిర్వహించిన సభలో దీన్నే ప్రధానాంశంగా తీసుకున్నారు. గతంలో సెంట్ భూమి తీసుకొని ఇల్లు కట్టుకున్న వారు కూడా చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జగన్ సెంట్ భూమి ఇస్తే చంద్రబాబు ని రెండు సెంట్ల భూమి ఇవ్వమనండి అని ప్రజలు అడుగుతున్నారు. టిడికో ఇళ్లలో ప్రధాన సమస్య నాలుగు అయిదు అంతస్తుల వరకు ఉండటం. అంత పైకి ఎక్కడానికి ఎవరు ఇష్ట పడటం లేదు.
దీనికి ప్రధాన కారణం లిఫ్ట్ లేకపోవడం. ఇళ్లలో ప్రతి చోట ఇదే సమస్య ఎదురవుతోంది. లిఫ్ట్ లేకపోవడం వల్ల టిడికో ఇళ్లు తీసుకోవడానికి ఎవరు ముందుకు రావడం లేదు. అయిదు అంతస్తుల బిల్డింగులు ఎక్కడానికి ఎవరికి ఓపిక ఉంటుంది. ఎవరో బ్యాచిలర్ కుర్రాళ్లు తప్ప అంత పైకి వెళ్ళడానికి ఎవరు ఇష్టపడరు. చంద్రబాబు ఇచ్చిన ఇళ్ల పరిస్థితి ఇది అని ఎత్తి చూపుతున్నారు.
కానీ ఒక సెంట్ భూమి అంటే దాదాపు 460 ఎస్‌ఎఫ్‌టీ సమానం అలాంటి సెంటు భూమిని సమాధి తో పోల్చిన చంద్రబాబు నాయుడుని వైసీపీ నాయకులు జగన్ సైతం తీవ్రంగా విమర్శిస్తున్నారు. దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి చంద్రబాబుపై మరింత వ్యతిరేకత తేవాలని వైసీపీ అధినేత, నాయకులు ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తోంది.