జగన్మోహన్ రెడ్డి, పవన్ కళ్యాణ్ ఇద్దరూ దాదాపుగా ఒకేసారి రాజకీయాల్లోకి వచ్చారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ జగన్ ను ముఖ్యమంత్రి అవ్వనివ్వకూడదని ఆయనకు వ్యతిరేకంగా రెండు సార్లు రాజకీయ పావులు కదిపారు. ఇక వచ్చే ఎలక్షన్లలో కూడా మూడోసారి జగన్ కి వ్యతిరేకంగా  ముందుకు వెళ్ళబోతున్నారు. 2014లో జగన్మోహన్ రెడ్డిని అధికారంలోకి రానివ్వకూడదని పవన్  తెలుగుదేశం, బిజెపి కూటమితో  కలిసి ప్రచారం చేశారు.


2019 లోకి వచ్చేసరికి తాను  పొత్తు పెట్టుకోవడం ద్వారా ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను చీల్చడం లో ప్రధాన పాత్రను పోషించాడు. అయినా సరే అప్పుడు జరిగిన ఎన్నికల్లో జగన్ భారీ మెజార్టీతో విజయం సాధించారు. ఇక అప్పటివరకు జగన్మోహన్ రెడ్డిని గద్దెనెక్కనివ్వను అన్న పవన్ అప్పటి నుండి రాబోయే ఎలక్షన్లలో జగన్మోహన్ రెడ్డిని  గద్దె దించుతాను అనే స్వరంతో పోరాడుతున్నట్లుగా తెలుస్తుంది. అయినా కూడా పవన్  పిలుపులకు జగన్ ఇప్పటి వరకు మూడుసార్లు  స్పందించారని సమాచారం.


గతంలో పవన్ కళ్యాణ్ అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీని కాకుండా ప్రతిపక్షంలో ఉన్న జగన్ కి పిలుపునిచ్చారట. మీ పార్టీకి సంబంధించిన ఎంపీలతో రాజీనామా చేయిస్తే ప్రత్యేక హోదా పైన నాకు తెలిసిన ప్రాంతీయ పార్టీలతో కలిసి ప్రభుత్వం మీద అవిశ్వాసం ప్రకటిద్దాం అని పిలుపునిచ్చాడట పవన్ . అయితే దానికి స్పందించిన జగన్ తన ఎంపీలతో రాజీనామా కూడా చేయించారట. కానీ పవన్  మాత్రం ఆ తర్వాత ఆ ఊసే ఎత్తలేదు అని అంటారు.


అలాగే  విశాఖలో ఇన్వెస్ట్మెంట్ జరుగుతున్న సమయంలో కూడా ప్రతిపక్ష నాయకుడు అయిన జగన్మోహన్ రెడ్డిని దమ్ముంటే రమ్మనండి అని పిలిచారట. అయితే ఆ పిలుపుకు కూడా స్పందించిన జగన్ విశాఖకు వెళ్లారట. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా అధికార ప్రమాణం చేసే సమయంలో సీనియర్ నేత అయిన చంద్ర బాబు నాయుడుని కూడా పక్కన పెట్టి, పవన్ కళ్యాణ్ కి ఫోన్ చేసి మరి ఆహ్వానించారట జగన్.

మరింత సమాచారం తెలుసుకోండి: