ఒకప్పుడు, ఇంజినీరింగ్, డాక్టర్లు అంటే ఎంతో కాస్లీ చదువులతోనే సాధ్యమయ్యేది. ఇంజినీరింగ్, డాక్టర్ చదువులు చదవాలంటే గతంలో ఆస్తులు అమ్ముకుని పిల్లలను చదివించాల్సి వచ్చేది. ఇల్లు, జాగ, భూములు అమ్మితే కానీ ఆ చదువులు సాధ్యమయ్యేది కాదు. కాలం మారింది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి తీసుకొచ్చిన  పథకం ఫీజు రీయింబర్స్ మెంట్. ఈ పథకంలో సామాన్య కుటుంబంలో పుట్టిన ఏ విద్యార్థి అయినా ఇంజినీరింగ్ విద్య, మెడిసిన్ చదివేలా చేశారు.


అప్పటి వరకు ఇంజినీరింగ్, మెడికల్ కాలేజీలు చాలా తక్కువగా ఉండేవి. ఆయా కళాశాలల్లో సీటు దొరకడమే కష్టంగా ఉండేది. ఇండియాలో చదవాలంటే ఎంసెట్ పాసవ్వాలి. ఎంసెట్ రాసిన వారికి సీటు వస్తదన్న గ్యారంటీ లేదు. మెడిసిన్ ను చదివేందుకు గత్యంతరం లేని పరిస్థితుల్లో చైనా, ఉక్రెయిన్, పిలిఫ్పీన్, లాంటి దేశాలకు వెళ్లి చదివేవారు. ఇండియాకు వచ్చిన తర్వాత ప్రాక్టీస్ పెట్టాలంటే ఇక్కడ భారత ప్రభుత్వం నిర్వహించే ఎగ్జామ్ పాసవ్వాలి.


అయితే అందులో ఒక్క శాతం మంది కూడా పాస్ కావడం లేదు. చివరకు వారిని కార్పొరేట్ కాలేజీల్లో చేర్చుకుని నర్సుల కంటే తక్కువ జీతం ఇచ్చి ఉద్యోగం చేయించుకుంటున్నారు. అయితే కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం 10 లక్షల మందికి 100 ఎంబీబీఎస్ సీట్లు ఉండేట్లు తాజాగా నిర్ణయం తీసుకున్నారు. కనీసం 220 పడకల బోధనాసుపత్రి తప్పనిసరి అని చేసింది.


2024-2025 లో విద్యా సంవత్సరం నుంచి కొత్త వైద్యశాలల ఏర్పాటు గురించి ఇప్పుడే పనులు మొదలెట్టింది. మినిమం స్టాండర్డ్ రిక్వైర్ మెంట్ 2023  మార్గదర్శకాలను  నేషనల్ మెడికల్ కమిషన్ విడుదల చేసింది. కొత్త కళాశాలల్లో ప్రతి ఒక్కరికి మెడికల్ కాలేజీల్లో 75 శాతం హాజరుండాలి. ఎంబీబీఎస్ విద్యార్థులకు ఆధార్ తో అటెండెన్స్ విధానాన్ని అమలు చేస్తారు. కళాశాలల్లో మొత్తం 21 విభాగాలు ఉండాల్సిందే.  ఇలా అనేక అంశాలతో కూడిన వివరాలను నేషనల్ మెడికల్ కమిషన్ తెలిపింది.

మరింత సమాచారం తెలుసుకోండి: