ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ పొలిటకల్ హీట్ పెరుగుతోంది. ఇటీవల బీజేపీ, కాంగ్రెస్ మ్యానిఫెస్టో విడుదలైన తర్వాత ఎవరు ఏం హామీ ఇచ్చారో చర్చ ఎక్కువగా జరుగుతోంది. ప్రజలు కూడా ఎవరికి ఓటేస్తే ఏం వస్తుందని లెక్కలు వేసుకుంటున్నారు. కాంగ్రెస్ రూ.500 కి సిలిండర్ ఇస్తామంటే బీఆర్ఎస్ రూ.400 కే ఇస్తామని పేర్కొంది. బీజేపీ అయితే మరో అడుగు ముందుకేసి ఏడాదికి నాలుగు సిలిండెర్లు ఉచితంగా ఇస్తామని ప్రకటించింది.


తమ పార్టీ అధికారంలోకి వస్తే ధరణి పథకాన్ని తీసుకెళ్లి బంగాళాఖాతంలో పడేస్తాం అని కాంగ్రెస్ నాయకులు పదే పదే చెబుతున్నారు. బీఆర్ఎస్ తీసుకొచ్చిన ధరణిపై అటు హస్తం నేతలు, ఇటు బీజేపీ నాయకులు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. దీంతో ఈ ఎన్నికల్లో ధరణినే పెద్ద  రాజకీయ అంశంగా మారిపోయింది. సీఎం కేసీఆర్ కూడా ప్రతి సభలో ధరణి ఉండాలా వద్దా.. ధరణి లేకపోతే రైతుబంధు డబ్బులు ఎలా వస్తాయి అటూ పదే పదే ప్రశ్నిస్తున్నారు.


మరోవైపు కాంగ్రెస్ తమ మ్యానిఫెస్టోలో ధరణి ని రద్దు చేసి దాని స్థానంలో భూ మాత అనే పోర్టల్ తీసుకు రానున్నట్లు పేర్కొంది. ఈ పోర్టల్ ద్వారా భూ హక్కులు కోల్పోయిన వారికి న్యాయం చేస్తామని హస్తం పార్టీ ప్రకటించింది. ధరణి పోర్టల్ లో ఉన్న అవకతవకలను తొలగిస్తామని ప్రకటించింది.


ధరణి పేరుతో సీఎం కేసీఆర్ భూములు అన్నింటిని ఆన్ లైన్ చేశారు. అయితే ఆ భూమి హక్కు దారులకు కాకుండా ఎవరి పేరు మీద అయితే రికార్డు అయి ఉందో వారికే రిజిస్ర్టేషన్ అయింది. నిజమైన హక్కుదారులు అన్యాయానికి గురయ్యారు అనేది కాంగ్రెస్ వాదన. దీంతో పాటు ధరణిలో మార్పులు చేర్పులకు అవకాశం లేకుండా చేశారు.  వీటన్నింటిని సమూలంగా ప్రక్షాలన చేసి తాము  భూ రికార్డులకు వ్యతిరేకం కాదు.. ఆ విధానం ద్వారా కొంతమంది భూములు కోల్పోయారు. కాబట్టి భూమాత ద్వారా వీటన్నింటిని సరి చేస్తాం అని కాంగ్రెస్ ప్రకటించింది.


మరింత సమాచారం తెలుసుకోండి: